ఆదిత్య 369.. తెలుగు చలనచిత్ర చరిత్రలో చిర స్థాయిగా నిలిచిపోయే సినిమా. ప్రయోగాత్మక చిత్రాల గురించి ఇప్పుడందరూ మాట్లాడుకుంటున్నారు కానీ.. మూడు దశాబ్దాల కిందటే ఇండియాలో ఎవరూ టచ్ చేయని వినూత్నమైన సబ్జెక్టుతో ఈ సినిమా తీసి అబ్బురపరిచారు లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు. ఆయన పనితనానికి నందమూరి బాలకృష్ణ అద్భుత నటన కూడా తోడవడం, మిగతా టీం అంతా కూడా బెస్ట్ ఔట్ పుట్ ఇవ్వడంతో ఈ సినిమా ఒక క్లాసిక్ లాగా నిలిచిపోయింది.
ఇప్పుడు చూసినా చాలా కొత్తగా, ఎంతో ఆసక్తికరంగా అనిపించే టైమ్ లెస్ క్లాసిక్ ఇది. ఐతే టాలీవుడ్ గర్వించదగ్గ ఈ గొప్ప ప్రయోగం సాధ్యమయింది గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వల్లే. ఆయనే పూనుకోకుంటే ఈ సినిమా తెరకెక్కేదే కాదంటున్నారు సింగీతం.
ఓ హాలీవుడ్ రచయిత టైమ్ మెషీన్ నేపథ్యంలో రాసిన ఓ నవలను చదివినప్పటి నుంచి దాని నేపథ్యంలో సినిమా చేయాలన్న ఆలోచన తన మనసులో బలంగా నాటుకుపోయిందని.. ఎన్నో ఏళ్ల పాటు ఆ ఆలోచనను తన మనసులోనే దాచుకున్నానని.. ఐతే ఒక సందర్భంగా బాలుతో కలిసి విమానంలో ప్రయాణిస్తున్నపుడు ఆయనకు ఆదిత్య 369 కాన్సెప్ట్ వినిపిస్తే చాలా ఎగ్జైట్ అయి ఈ సినిమా చేయాల్సిందే అని పట్టుబట్టారని.. తర్వాత నిర్మాత శివలెంక ప్రసాద్‌ను కలిసి తాను సమర్పకుడిగా వ్యవహరిస్తూ సినిమా చేయడానికి సిద్ధమయ్యారని సింగీతం వెల్లడించారు.
ఐతే బాలకృష్ణ ప్రధాన పాత్ర చేస్తానంటేనే ఈ సినిమాను తాను తీస్తానని ముందే కండిషన్ పెట్టానని.. బాలయ్య అంగీకరించడంతో సినిమా పట్టాలెక్కిందని సింగీతం తెలిపారు. ఈ సినిమాకు సమర్పకుడిగా వ్యవహరించడమే కాదు.. మేకింగ్ కూడా దగ్గరుండి చూసుకున్నారు బాలు. అలాగే అద్భుతమైన పాటలతో, అలాగే టిను ఆనంద్‌కు చెప్పిన డబ్బింగ్‌తో సినిమాకు పెద్ద బలంగా నిలిచారు.
This post was last modified on July 19, 2021 1:24 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…