రాహుల్ విజయ్.. టాలీవుడ్లో హీరోగా వెలిగిపోవాలని ఎన్నో ఆశలతో వచ్చిన కుర్రాడు. టాలీవుడ్లో సుదీర్ఘ కాలంగా ఫైట్ మాస్టర్‌గా కొనసాగుతున్న విజయ్ కొడుకు ఇతను. ఇండస్ట్రీలో విజయ్‌కు మంచి పరిచయాలే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ సహా చాలామంది హీరోలతో అనుబంధం ఉంది.
ఇండస్ట్రీలో ఎవరూ వచ్చి నేరుగా సాయం చేయాల్సిన పని లేదు కానీ.. తెరవెనుక సపోర్ట్ ఉన్నా అది బాగానే పనికి వస్తుంది. ఈ భరోసాతోనే తన కొడుకును హీరోగా పరిచయం చేశాడు విజయ్. రాహుల్ తొలి చిత్రం ‘ఈ మాయ పేరేమిటో’ను సొంత నిర్మాణ సంస్థలో నిర్మించగా.. తారక్ తదితరులు వచ్చి దాన్ని ప్రమోట్ కూడా చేశారు.
కానీ ఆ సినిమా రాహుల్‌కు నిరాశనే మిగిల్చింది. ఆ తర్వాత మెగా ఫ్యామిలీ అమ్మాయి కొణిదెల నిహారికకు జోడీగా ‘సూర్యకాంతం’ అని మరో సినిమా చేశాడు. అదీ ఆడలేదు. రాజేంద్ర ప్రసాద్‌తో కలిసి ‘కాలేజ్ కుమార్’ అనే సినిమా చేస్తే అది అడ్రస్ లేకుండా పోయింది.
ఫిలిం కెరీర్లో ఇలా ఒడుదొడుకులు ఎదుర్కొన్న రాహుల్… ఇప్పుడు డిజిటల్ రంగంలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఆహా వారి ‘కుడి ఎడమైతే’ వెబ్ సిరీస్‌లో ముఖ్య పాత్ర పోషించాడు. అమలాపాల్ మరో ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటోంది. లూసియా, యు టర్న్ చిత్రాల దర్శకుడు పవన్ కుమార్ తనదైన శైలిలో టైం లూప్ అనే వెరైటీ కాన్సెప్ట్‌తో ఈ సిరీస్‌ను తీర్చిదిద్దాడు. ఇందులో డెలివరీ బాయ్ పాత్రలో రాహుల్ ఆకట్టుకున్నాడు. పక్కింటి కుర్రాడి పాత్రలో అతను సులువుగా ఒదిగిపోయాడు. సహజంగా నటించాడు.
ఈ సిరీస్ విజయ్‌కు మంచి పేరే తెస్తోంది. అతడి రియల్ టాలెంట్ ఇప్పటికి బయటపడిందనే చెప్పాలి. ఈ సిరీస్ చూశాక దర్శకులు సినిమాల్లో మంచి పాత్రలు అతడికి ఇవ్వడానికి ఛాన్సుంది. ప్రస్తుతం విజయ్ ‘పంచతంత్రం’ అనే వైవిధ్యమైన సినిమా చేస్తున్నాడు. ‘కుడి ఎడమైతే’తో సత్తా చాటిన అతడికి మరిన్ని వెబ్ సిరీస్‌లు స్వాగతం పలుకుతాయేమో చూడాలి.
This post was last modified on July 18, 2021 6:14 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…