పవన్ కళ్యాణ్ పేరెత్తితే చాలు బండ్ల గణేష్‌కు పూనకాలు వచ్చేస్తాయి. స్టేజ్ ఎక్కినా.. మీడియా ముందు మాట్లాడినా.. అతను ఉద్వేగాన్ని ఆపుకోలేడు. మరీ అతి చేస్తాడు అని.. అంతగా భజన చేయాలా అని కామెంట్లు చేసినా అతను పట్టించుకునే రకం కాదు. తన అభిమానం తనది అంటాడు. గతంలో ‘గబ్బర్ సింగ్’ ఆడియో వేడుకలో పవన్‌ను ఆకాశానికెత్తేస్తూ బండ్ల చేసిన ప్రసంగం ఎంత వైరల్ అయిందో తెలిసిందే. పవన్ సైతం కడుపు చెక్కలయ్యేలా నవ్వాడు ఆ ప్రసంగం వింటూ.
ఈ మధ్య ‘వకీల్ సాబ్’ ప్రి రిలీజ్ ఈవెంట్లో అలాంటి స్త్రోత్రమే మరొకటి చేశాడు. ఈశ్వరా.. పవనేశ్వరా.. పవరేశ్వరా అంటూ బండ్ల ఇచ్చిన ఎలివేషన్లకు అభిమానుల నుంచి అదిరిపోయే స్పందన వచ్చింది. ఈ సందర్భంగా పవన్ నా ‘దేవర’ అంటూ కొత్త మాటను ప్రయోగించాడు బండ్ల. ఈ మధ్య ఎక్కడ చూసినా అదే మాట అంటున్నాడు.
ఐతే పవన్ అభిమానులకు ‘దేవర’ అనే పదం బాగా నచ్చేసి.. దాన్ని పవన్‌తో బండ్ల చేయబోయే సినిమాకు టైటిల్‌గా పెట్టాలని డిమాండ్ చేస్తుండటం విశేషం. ట్విట్టర్లో బండ్లను ట్యాగ్ చేస్తూ వందల మంది అభిమానులు ‘దేవర’ టైటిల్ కోసం డిమాండ్ చేస్తున్నారు. సినిమా ఎప్పుడు తీస్తావో ఏంటో.. ముందు దాన్ని రిజిస్టర్ చేయించేయ్ అంటూ బండ్లను ట్యాగ్ చేస్తుండటం విశేషం.
ఈ విషయమై వచ్చిన ఒక వార్త లింక్‌ను షేర్ చేస్తూ ఓ అభిమాని టైటిల్ రిజిస్టర్ చేయమని బండ్లను కోరితే.. అలాగే అన్నట్లుగా థంప్సప్ ఎమోజీ పెట్టాడు బండ్ల. అభిమానులకు నచ్చే ఇలాంటి క్రేజీ పనులు చేయడానికి బండ్ల ఎప్పుడూ ముందుంటాడు. కాబట్టి ‘దేవర’ టైటిల్ రిజిస్టర్ చేయించినా చేయించేస్తాడేమో. ‘టెంపర్’ తర్వాత నిర్మాణానికి దూరమైన బండ్ల.. ఈ మధ్య మళ్లీ సినీ ఫీల్డులో యాక్టివ్ అవడం, పవన్‌తో మరో సినిమా చేస్తానని ప్రకటించడం తెలిసిందే. మరి ఆ చిత్రానికి నిజంగానే ‘దేవర’ అనే టైటిల్ పెట్టించేస్తాడేమో చూడాలి.
This post was last modified on July 18, 2021 7:30 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…