రెండు రోజుల కిందట రిలీజ్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియో ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. నిజానికిది ప్రేక్షకులకు పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడీ మేకింగ్ వీడియో రాబోతోందని కొన్ని రోజుల ముందు వరకు ఎలాంటి సంకేతాలు లేవు.
కొత్త సినిమాల విడుదలపై ఎక్కడలేని సందిగ్ధత నెలకొన్న ఏ చిత్ర బృందం నుంచి అప్‌డేట్స్, ప్రమోషనల్ వీడియోలు ఆశించట్లేదు జనాలు. ఐతే ‘ఆర్ఆర్ఆర్’ టీం ఊహించని విధంగా మేకింగ్ వీడియో రిలీజ్ చేసింది. అది ఒక రేంజ్‌లో ఉండటంతో ప్రేక్షకులు థ్రిల్లయిపోయారు.
ఈ సినిమాపై ఇప్పటికే ఉన్న అంచనాలను మరింత హెచ్చు స్థాయికి తీసుకెళ్లిపోయింది ఈ వీడియో. రాజమౌళి మార్కు భారీతనం.. అదిరిపోయే సెట్టింగ్స్.. ఒళ్లు గగుర్పొడిచే స్టంట్స్.. హీరోలిద్దరి గూస్ బంప్ షాట్స్.. అలాగే లొకేషన్లో రాజమౌళికి ఎలివేషన్ ఇస్తున్న షాట్స్.. ఇంకా స్టన్నింగ్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ వీడియోకు అదిరిపోయే స్పందన తెచ్చిపెట్టాయి.
ఈ వీడియో చూసి అందరూ రాజమౌళిని ఆకాశానికెత్తేస్తున్నారు. మేకింగ్ వీడియోలో కూడా జక్కన్న తన మార్కు చూపించాడంటూ పొగిడేస్తున్నారు. ఐతే రాజమౌళి మాత్రం ఈ క్రెడిట్ తనకు దక్కాల్సింది కాదన్నాడు. గత రెండు నెలల్లో తాను ‘ఆర్ఆర్ఆర్’ పోస్ట్ ప్రొడక్షన్ మీదే దృష్టిసారించానని.. ఈ రెండు నెలలు మేకింగ్ వీడియో కోసం కష్టపడింది తన కొడుకు కార్తికేయ, మరికొందరని రాజమౌళి వెల్లడించాడు.
కార్తికేయతో పాటు ఎడిటర్ వంశీ అట్లూరి, ప్రదీప్ అనే డిజిటల్ మార్కెటింగ్ మేనేజర్, అలాగే వాల్స్ అండ్ ట్రెండ్స్ టీం కలిసి ఈ వీడియోను రూపొందించినట్లు రాజమౌళి వెల్లడించాడు. ఈ వీడియోకు నేపథ్య సంగీతం అందించడంలో కీరవాణికి మరో సంగీత దర్శకుడు అచ్చు రాజమణి కూడా సాయం చేశాడట. టీజర్లో వినిపించే ర్యాప్ సౌండ్స్ క్రెడిట్ అంతా అతడిదేనట.
ఈ వీడియో వెనుక ఉన్నది రాజమౌళి కొడుకు కాబట్టే హీరోలను మించి జక్కన్నకు ఎలివేషన్ ఇచ్చాడని అర్థమవుతోంది. ఐతే ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ రాజమౌళే కాబట్టి ఆయనకా ఎలివేషన్ ఇవ్వడంలో తప్పేమీ లేదు.
This post was last modified on July 17, 2021 4:15 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…