మెగా హీరోల్లో సాయిధరమ్ తేజ్ ఉన్నంత సరదాగా ఇంకెవరూ ఉండరన్నది అందరికీ తెలిసిన విషయమే. హీరోగా తనకంటూ ఒక రేంజ్ అందుకున్నాక కూడా చాలా సామాన్యంగా కనిపిస్తూ తన తోటి ఆర్టిస్టులు, టెక్నీషియన్లతో కలిసి అల్లరి చేస్తుంటాడతను. వెన్నెల కిసోర్, సత్య, తమన్ లాంటి వాళ్లతో అతడి గిల్లికజ్జాలు ఎలా ఉంటాయో చూసే ఉంటారు. సోషల్ మీడియాలో కూడా తేజు చాలా సరదాగా ఉంటాడు.
ట్విట్టర్లో తన స్నేహితుల్ని కవ్వించడం.. కౌంటర్లు వేయడం తేజుకు అలవాటు. తాజాగా అతను వరసకు తనకు బావ అయ్యే వరుణ్ తేజ్‌కు కౌంటర్ వేశాడు. తన కూతురు నిహారికకు ముందుగా పెళ్లి చేసి.. వెంటనే వరుణ్ తేజ‌్ పెళ్లికి కూడా సన్నాహాలు చేస్తానంటూ ఇటీవలే నాగబాబు తన యూట్యూబ్ ఛానెల్ ‘నా ఇష్టం’లో వెల్లడించిన సంగతి తెలిసిందే.
ఈ వీడయోకు సంబంధించిన యూట్యూబ్ థంబ్ నైల్ స్క్రీన్ షాట్ తీసి ట్విట్టర్లో షేర్ చేసిన తేజు.. ‘ఏం బావా నీకు పెళ్లంట’ అంటూ వరుణ్ తేజ్‌ను ట్యాగ్ చేసి కవ్వించే ప్రయత్నం చేశాడు. దీనికి వరుణ్ ఇంకా సమాధానం ఇవ్వలేదు. ఈ లోపు తేజు ట్వీట్ మీద మెగా అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. వరుణ్ సంగతి తర్వాత ఇంతకీ నీ సంగతేంటి.. ‘సోలో బతుకే సో బెటరు’ అనుకుంటూ గడిపేస్తావా అంటూ ప్రశ్నలు గుప్పించారు.
నిజానికి తేజు సైతం పెళ్లికి రెడీ అవుతున్నాడని.. అతడికి ఇప్పటికే మ్యాచ్ ఫిక్సయిందని.. ‘సోలో బతుకే సో బెటరు’ రిలీజయ్యాక ఈ ఏడాదే అతడి పెళ్లి ఉంటుందని కొన్ని రోజులుగా వార్తలొస్తున్నాయి. వరుణ్ కంటే తేజు వయసులోనే కాదు.. సినిమాల్లోనూ సీనియరే. తేజు వయసు 33 ఏళ్లు కాగా.. వరుణ్‌కు ఇంకా 30 ఏళ్లే. కాబట్టి వరుణ్ కంటే ముందు పెళ్లి పీటలు ఎక్కాల్సిన వాడు తేజునే. అదే జరిగినా ఆశ్చర్యం లేదేమో.
This post was last modified on May 23, 2020 2:17 pm
నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్‌ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…