ఒక పెద్ద సినిమా రిలీజ్ అవుతుందంటే దాదాపు సోలో రిలీజ్ ఉండేలా చూసుకుంటారు. ఇక ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒకేసారి ఇద్దరు హీరోల సినిమాలు రిలీజైతే కలెక్షన్స్ షేర్ చేసుకోవాల్సి వస్తుంది. అందుకే ఎవరూ కూడా తొందరపడడం లేదు. నిదానంగా తమ సినిమాలను రిలీజ్ చేసుకోవాలనుకుంటున్నారు. కానీ ఇప్పుడు ఇద్దరు స్టార్ హీరోల దృష్టి ఒకే డేట్ పై పడిందని తెలుస్తోంది. కోలీవుడ్ లో స్టార్ హీరోలుగా చెలామణి అవుతోన్న సూపర్ స్టార్ రజినీకాంత్, అజిత్ కుమార్ బాక్సాఫీస్ వద్ద పోటీకి రెడీ అవుతున్నారని సమాచారం.
తమిళనాట దీపావళి, సంక్రాంతి పెద్ద పండుగలు. గతంలో దీపావళికి రెండు సినిమాలు విడుదలైన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా అలానే పోటీ పడాలనుకుంటున్నారు. రజినీకాంత్ నటించిన ‘అన్నాత్తే’ సినిమాను నవంబర్ 4న విడుదల చేయనున్నారు. అలానే అజిత్ ‘వాలిమై’ కూడా అదే డేట్ కి వస్తుందని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ ను విడుదల చేయగా.. అది సోషల్ మీడియాలో సెన్సేషన్ అయింది.
ఇప్పుడు ఈ సినిమాను రజినీకాంత్ సినిమాకి పోటీగా తీసుకురావాలనుకుంటున్నారు. హెచ్.వినోత్ డైరెక్ట్ చేస్తోన్న ‘వాలిమై’ చిత్రాన్ని బోనీకపూర్ నిర్మించారు. అయితే ఈ సినిమా రిలీజ్ డేట్ కి సంబంధించి ఎలాంటి అధికార ప్రకటన రాలేదు. కానీ డిస్ట్రిబ్యూటర్లకు మాత్రం దీపావళికి సినిమాను విడుదల చేస్తామని సంకేతాలు పంపిస్తున్నారు.
This post was last modified on July 17, 2021 8:37 am
దక్షిణాది సంగీత దర్శకుల్లో అత్యధిక డిమాండ్ ఎంజాయ్ చేస్తున్న వాళ్లలో మొదట వినిపించే పేరు అనిరుధ్ రవిచందర్. బ్యాక్ గ్రౌండ్…
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీపై సోషల్ మీడియాలో రకరకాల ట్రోలింగ్స్ వస్తుంటాయి. గతంలో అయితే ఆయనను పప్పు అంటూ…
తెలుగు సినిమా చరిత్రలోనే అత్యంత గొప్ప నటుడైన మోహన్ బాబును గత 20 ఏళ్లలో మన ఇండస్ట్రీ సరిగా ఉపయోగించుకోలేదనే…
సీఎం రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్ ల మధ్య మరోసారి మాటల యుద్ధం మొదలైంది. కేటీఆర్ కు లగ్జరీ…
టాలీవుడ్ బిజీ హీరోల్లో ఆది సాయికుమార్ పేరు ఖచ్చితంగా ఉంటుంది. వరసగా హిట్లు లేకపోయినా అవకాశాలకు లోటు లేకుండా ఏదో…
విజయ్ సేతుపతి హీరోగా తమిళంలో బత్తా విడుదలయ్యింది. ప్రమోషన్లు జోరుగా చేశారు. తెలుగు డబ్బింగ్ చేద్దామనుకున్నారు కానీ ఎక్కువ రిలీజులు…