మొత్తానికి భారతీయ ప్రేక్షకులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న మేకింగ్ వీడియో రానే వచ్చింది. ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియోను రిలీజ్ చేశారు. ఇప్పటిదాకా ఈ చిత్రంపై ఉన్న అంచనాలను ఇది మరింత పెంచేలాగే ఉంది. ‘బాహుబలి’కి ఏమాత్రం తీసిపోయి భారీ ఎంటర్టైనర్‌నే జక్కన్న ప్రేక్షకులకు అందించబోతున్నాడని స్పష్టమైంది. మేకింగ్ వీడియోలో ప్రతి మూమెంట్ ప్రేక్షకులను థ్రిల్ చేసింది. అన్నింటికంటే థ్రిల్లింగ్ విషయం ఏంటంటే.. ఈ చిత్రం ముందు అనుకున్న ప్రకారమే అక్టోబరు 13న విడుదల కానున్నట్లు ప్రకటించడం.
మామూలుగానే ఆ డేట్‌ను ‘ఆర్ఆర్ఆర్’ అందుకోవడం కష్టం అనుకుంటుంటే.. కరోనా సెకండ్ వేవ్ దెబ్బకు రెండు నెలలకు పైగా షూటింగ్ ఆగిపోయిన నేపథ్యంలో దసరా కానుకగా ‘ఆర్ఆర్ఆర్’ రావడం అసాధ్యం అని ప్రేక్షకులంతా ముందుగానే ఓ నిర్ణయానికి వచ్చేశారు.
ఇప్పటికే రెండుసార్లు సినిమా వాయిదా పడ్డప్పటికీ.. పరిస్థితుల దృష్ట్యా మరోసారి పోస్ట్ పోన్ చేసినా ప్రేక్షకులు అర్థం చేసుకునే స్థితిలోనే ఉన్నారు. కానీ ఆశ్చర్యకరంగా ‘ఆర్ఆర్ఆర్’ను అక్టోబరు 13నే విడుదల చేస్తామని జక్కన్న అండ్ కో నొక్కి వక్కాణించడం ప్రేక్షకుల్లో అమితానందాన్ని కలిగిస్తోంది. కరోనా టైంలో పోస్ట్ ప్రొడక్షన్ పనులు కొనసాగించడం ద్వారా ‘ఆర్ఆర్ఆర్’ టీం కరోనా సెకండ్ వేవ్ ప్రభావం తమపై పడకుండా చూసుకున్నట్లుంది. ఐతే రాజమౌళి టీం ఎంతో కష్టపడి మాటకు కట్టుబడి ఉండాలని చూస్తుండటం మంచిదే కానీ.. పరిస్థితులు ఏమేర సహకరిస్తాయన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత నెలలోనే దేశవ్యాప్తంగా మెజారిటీ రాష్ట్రాల్లో లాక్ డౌన్ అయితే ఎత్తేశారు కానీ.. తెలుగు రాష్ట్రాలు సహా ఎక్కడా కూడా థియేటర్లు అంతగా తెరుచుకోలేదు.
ముందు అవి ఓపెన్ అవ్వాలి. జనాలు థియేటర్లకు రావాలి. థియేటర్లలో ఒకప్పటి కళ కనిపించాలి. దేశవ్యాప్తంగా ‘ఆర్ఆర్ఆర్’పై భారీ అంచనాలున్న నేపథ్యంలో అన్ని చోట్లా థియేటర్ల మునుపటి లాగా మామూలుగా నడిస్తే తప్ప ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేరు. మరి కరోనా థర్డ్ వేవ్ ముప్పు హెచ్చరికల నేపథ్యంలో దసరా టైంకి థియేటర్లు సాధారణ స్థితిలో నడుస్తాయా అన్నది డౌటే.
ఐతే తమ వరకు లోపం లేకుండా ఆ సమయానికి సినిమా పూర్తి చేసేయాలని రాజమౌళి బృందం నిశ్చితాభిప్రాయంతో ఉన్నట్లుంది. దసరాకు ‘ఆర్ఆర్ఆర్’ విడుదల చేసే పరిస్థితి లేకపోయినా.. ఈ సినిమా ఫస్ట్ కాపీ తీసి నిర్మాత దానయ్య చేతిలో పెట్టేసి మహేష్ బాబు సినిమా పనుల్లో నిమగ్నమవుతాడేమో జక్కన్న.
This post was last modified on July 16, 2021 6:55 am
ఏపీ పర్యటనకు వచ్చిన కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా వద్ద ఏపీ సీఎం చంద్రబాబు…
రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందన్నది చెప్పలేం. రాజకీయాలు రాజకీయాలే. ఇప్పుడు ఇలాంటి పరిణామమే ఎన్టీఆర్ జిల్లాలోనూ జరుగుతోంది. టీడీపీ ఎమ్మెల్యే…
కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా శనివారం రాత్రి ఏపీ పర్యటనకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ…
అవును… టీడీపీ పట్ల తెలంగాణకు ఇప్పటికీ ఆశ చావలేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా తెలంగాణలో టీడీపీకి పెద్దగా…
ప్రస్తుత రాజకీయాల్లో అధికారంలో ఉన్న పార్టీలదే రాజ్యం. విపక్ష పార్టీలకు కష్ట కాలం. అప్పటిదాకా అధికారంలో ఉండి… ఎన్నికల్లో ఓడిపోయి…
శంకర్.. ఒకప్పుడు ఈ పేరు చూసి కోట్లమంది కళ్లు మూసుకుని థియేటర్లకు వెళ్లిపోయేవారు. హీరోలు కథ వినకుండానే సినిమా ఒప్పేసుకునేవారు.…