కీరవాణి బయటి సినిమాలకు ఇచ్చే ఔట్ పుట్ వేరు. తన సోదరుడు రాజమౌళి చిత్రాలకు ఇచ్చే ఔట్ పుట్ వేరు. వేరే చిత్రాలకు ఆయనిచ్చే సంగీతం బాగోదని కాదు కానీ.. జక్కన్న సినిమా అంటే ఆయన పెట్టే శ్రమ అంతా ఇంతా కాదు. ఒక్కసారిగా శక్తులన్నీ కూడగట్టుకుని, ఎంతో కసితో జక్కన్న సినిమాకు పని చేస్తాడేమో అనిపిస్తుంది ఆయా చిత్రాల ఔట్ పుట్ చూస్తే. ‘బాహుబలి’తో భారతీయ ప్రేక్షకులందరికీ గూస్ బంప్స్ ఇచ్చారాయన.
ముఖ్యంగా ‘బాహుబలి: ది కంక్లూజన్’కు ఆయనిచ్చిన పాటలు, నేపథ్య సంగీతం గురించి ఎంత చెప్పినా తక్కువే. ఈ సినిమా ట్రైలర్ చూస్తేనే జనాలకు పూనకాలు వచ్చేశాయి. ఇక సినిమా హాళ్లలో నిజంగా ప్రేక్షకులందరికీ రోమాలు నిక్కబొడుచుకున్నాయంటే అతిశయోక్తి కాదు. ఐతే ప్రతిసారీ ఇలా అంచనాలు అందుకోవడం తేలిక కాదు. ఐతే ఈ విషయంలో రాజమౌళి లాగే కీరవాణి కూడా మాస్టర్ అయినట్లే ఉన్నారు.
‘ఆర్ఆర్ఆర్’ నుంచి ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్, మోషన్ పోస్టర్లలో కీరవాణి నేపథ్య సంగీతం ఎంతగా హైలైట్ అయిందో తెలిసిందే. తాజాగా రిలీజ్ చేసిన ‘ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియో స్కోర్ అయితే మరో లెవెల్ అనే చెప్పాలి. ఫస్ట్ షాట్ టైంలో వచ్చిన సౌండింగ్‌తోనే ప్రేక్షకుల్లో ఒక ఉద్వేగం కలిగించేలా స్కోర్ ఇచ్చాడు కీరవాణి. ఇక మోషన్ పోస్టర్ ఆద్యంతం అదే టెంపో కొనసాగింది.
‘ఆర్ఆర్ఆర్’ అంతర్జాతీయ స్థాయిలో భారీ స్థాయిలో రిలీజయ్యే చిత్రం కావడంతో హాలీవుడ్ సినిమాల టచ్ కూడా ఇచ్చారాయన. ఇంగ్లిష్ ర్యాప్ కూడా జోడించాడు. మొత్తంగా మేకింగ్ వీడియోలో కీరవాణి బీజీఎం చూస్తే.. సినిమా చూస్తున్నపుడు ప్రేక్షకులకు పూనకాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాకు పాటలు కూడా అదిరిపోయేలా ఇచ్చారని చిత్ర వర్గాలు అంటున్నాయి. ఇప్పటికే ఆ పాటల గురించి ఇండస్ట్రీలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. త్వరలోనే సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేస్తారని అంటున్నారు.
This post was last modified on July 16, 2021 6:47 am
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…