టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్ మంచి స్నేహితులనే సంగతి తెలిసిందే. ఇప్పుడు వీరిద్దరూ కలిసి ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తున్నారు. రాజమౌళి తెరకెక్కిస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా ఈ సినిమా మేకింగ్ వీడియోను వదిలారు. తొలిసారి మెగా, నందమూరి హీరోలు తెరపై కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ కాంబినేషన్ లో ఓ షోని ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
కొన్నాళ్లక్రితం బుల్లితెరపై ‘మీలో ఎవరు కోటీశ్వరులు’ అనే షోని ప్రసారం చేసిన సంగతి తెలిసిందే. స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ఈ షోని నాగార్జున, చిరంజీవి హోస్ట్ చేశారు. రేటింగులు సరిగ్గా రాకపోవడంతో షోని నిలిపివేశారు. ఇప్పుడు ఆ షో హక్కులను జెమినీ టీవీ తీసుకుంది. ఎన్టీఆర్ హోస్ట్ గా షోని ప్లాన్ చేసింది. ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే పేరుతో ఈ షోని ప్రసారం చేయనున్నారు. అయితే ఈ షోలకు సామాన్యులతో పాటు అప్పుడప్పుడు సెలబ్రిటీలను కూడా తీసుకొస్తుంటారు.
హాట్ సీట్ లో వాళ్లను కూర్చోపెట్టి షోకి హైప్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంటారు. అందులో భాగంగానే రామ్ చరణ్ ను గెస్ట్ గా తీసుకురాబోతున్నారు. ఈ మేరకు ప్లాన్ చేసిన ఎపిసోడ్ ను ఈరోజు చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుందనే విషయంలో క్లారిటీ లేదు. ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ సమయం వరకు వెయిట్ చేస్తారా..? లేక ఇప్పుడే ప్రసారం చేసేస్తారా చూడాలి!
This post was last modified on July 15, 2021 5:58 pm
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…
గల్లా జయదేవ్.. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు సొంతూరు చంద్రగిరికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తగానే కాకుండా… గుంటూరు…