బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్ పై పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. ప్రస్తుతం ఈ విషయం ఇండస్ట్రీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలు విషయంలోకి వస్తే.. ఇటీవల కరీనా తన ప్రెగ్నన్సీ అనుభవాన్ని పుస్తక రూపంలో విడుదల చేసిన సంగతి తెలిసిందే.
“కరీనా కపూర్ ఖాన్స్ ప్రగ్నెన్సీ బైబిల్” అనే పేరుతో ఈ పుస్తకాన్ని విడుదల చేసింది. ఈ బుక్ తనకు బిడ్డతో సమానమని చెప్పింది. అలాంటిది ఇప్పుడు ఆ పుస్తకం కారణంగానే ఆమె చిక్కుల్లో పడింది.
ఈ బుక్ టైటిల్ క్రిస్టియన్ల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉందంటూ కరీనా కపూర్ పై శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రకు చెందిన పలు క్రిస్టియన్ సంఘాలు కరీనాపై మండిపడుతున్నాయి.
అల్ఫా, ఒమెగా క్రిస్టియన్ మహాసంగ్ అధ్యక్షుడు ఆశిష్ షిండే కరీనాపై ఫిర్యాదు చేసినట్లు బీడ్ లోని శివాజీ నగర్ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ శ్రీనాథ్ తంభోర్ మీడియాకు వెల్లడించారు. కరీనాతో పాటు ఈ బుక్ రాసిన మరో రచయిత అదితి షా భీమ్జనిపై కూడా కేసు నమోదైంది.
ఈ బుక్ టైటిల్ పవిత్ర గ్రంథమైన బైబిల్ ని అవమానించేలా ఉందని ఆశిష్ షిండే తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయంలో పోలీసులు కంప్లైంట్ తీసుకున్నారే తప్ప.. ఎఫ్ఐఆర్ మాత్రం నమోదు చేయలేదని తెలుస్తోంది. నిజానికి ఈ కేసు ముంబై పరిధిలోకి వస్తుందని.. తమ స్టేషన్ పరిధిలోకి రాదని అధికారులు ఆశిష్ షిండేకి చెప్పినట్లు తెలుస్తోంది. ముంబైలో కేసు నమోదు చేయాల్సిందిగా అధికారులు సలహా ఇచ్చారట. మరి ఈ కేసుపై కరీనా ఎలా స్పందిస్తుందో చూడాలి!
This post was last modified on July 14, 2021 10:27 pm
తెలంగాణ హనుమకొండలోని అదాలత్ సెంటర్ వద్ద దారుణ ఘటన చోటుచేసుకుంది. పట్టపగలే అందరూ చూస్తుండగానే ఓ ఆటోడ్రైవర్ను కత్తితో దాడి…
జాతీయ పురాతన పార్టీ కాంగ్రెస్లో అంతర్గతంగా భారీ కలకలం రేగినట్టు తెలుస్తోంది. ఇద్దరు కీలక నాయకుల మధ్య వివాదాలు తారస్థాయికి…
గత ఏడాది హనుమాన్ బ్లాక్ బస్టర్ సాధించాక దర్శకుడు ప్రశాంత్ వర్మ కొత్త సినిమా ఇప్పటిదాకా ప్రారంభం కాలేదు. జై…
దిగ్గజ నటి, మాజీ ముఖ్యమంత్రి జయలలిత మరణానంతరం ఆమె మీద సినిమాలు, వెబ్ సిరీస్లు తీయడానికి ఒక సమయంలో ఫిలిం…
తక్కువ సినిమాలతోనే తమిళంలో గ్రేట్ డైరెక్టర్గా పేరు తెచ్చుకున్న గౌతమ్ మీనన్ కొన్నేళ్ల నుంచి కెరీర్ పరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.…
కేంద్ర హోం శాఖ మంత్రి, బీజేపీ అగ్రనాయకుడు అమిత్ షా నాలుగు రోజుల కిందట ఏపీలో పర్యటించా రు. విజయవాడ…