‘రాక్షసుడు 2’లో హీరో ఎవరంటే..?

తమిళంలో సూపర్ హిట్ గా నిలిచిన ‘రాక్షసన్’ సినిమాను తెలుగులో ‘రాక్షసుడు’ అనే పేరుతో రీమేక్ చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా దర్శకుడు రమేష్ వర్మ తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాతో దర్శకుడు రమేష్ వర్మ ట్రాక్ లో పడ్డాడు. దెబ్బకి రవితేజని డైరెక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ప్రస్తుతం వీరిద్దరి కాంబినేషన్ లో ‘ఖిలాడి’ అనే సినిమా రాబోతుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ‘రాక్షసుడు’ సినిమాకి సీక్వెల్ ను ప్రకటించారు.

నిజానికి తమిళంలో అయితే సీక్వెల్ రాలేదు. ‘రాక్షసుడు 2’ని మనవాళ్లే తెలుగులో ప్లాన్ నచ్చేస్తున్నారు. దీనికి కావాల్సిన కథ కూడా సిద్ధంగా ఉంది. కానీ ఇందులో ఎవరిని హీరోగా తీసుకోబోతున్నారనే విషయంలో క్లారిటీ లేదు. ముందుగా బెల్లంకొండ శ్రీనివాస్ నే హీరోగా అనుకున్నారు కానీ అతడు సిద్ధంగా లేడని సమాచారం. ఆయన చేతుల్లో హిందీ ‘ఛత్రపతి’ ఉంది. అలానే పెన్ స్టూడియోస్ బ్యానర్ పై మరో సినిమా ఒప్పుకున్నాడు.

ఈ సినిమాలను పూర్తి చేయడానికి కాస్త సమయం పడుతుంది. అంతకాలం ఎదురుచూడలేక దర్శకుడు రమేష్ వర్మ మరో హీరోతో సినిమా తీయాలనుకుంటున్నాడు. ముందుగా మీడియం రేంజ్ హీరోలను అనుకున్నప్పటికీ.. ఇప్పుడు మాత్రం కమెడియన్ రేంజ్ నుండి హీరోగా మారిన ఓ నటుడితో సినిమా తెరకెక్కించే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఆ హీరోని ఎప్పుడు అనౌన్స్ చేస్తారో చూడాలి!