బాలీవుడ్లో కొత్త కథలు పూర్తిగా అడుగంటి పోతున్నట్లే కనిపిస్తోంది పరిస్థితి చూస్తుంటే. సౌత్‌లో ఒక సినిమా హిట్టయిందంటే అది రీమేక్ కావాల్సిందే అన్నట్లుగా కనిపిస్తోంది వ్యవహారం. ఓ మోస్తరు సినిమాలను సైతం బాలీవుడ్ వాళ్లు వదలట్లేదు. ప్రస్తుతం హిందీలో రెండంకెల సంఖ్యలో సౌత్ సినిమాల రీమేక్‌లు తెరకెక్కుతున్నాయి.
తాజాగా మరో దక్షిణాది చిత్రం హిందీలోకి వెళ్లబోతోంది. ఆ చిత్రమే.. సూరారై పొట్రు. సూర్య ప్రధాన పాత్రలో తెలుగమ్మాయే అయిన సుధ కొంగర తమిళంలో రూపొందించిన ఈ సినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో వచ్చింది. గత ఏడాది కొవిడ్ టైంలో థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేస్తూ ఈ భారీ చిత్రాన్ని అమేజాన్ ప్రైమ్‌లో నేరుగా విడుదల చేశారు. ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి అద్భుతమైన వచ్చింది.
చాలా ఏళ్లుగా సరైన విజయం లేని సూర్యకు ఈ చిత్రం మంచి ఫలితాన్నందించింది. గత ఏడాది ఇండియాలో రిలీజైన అత్యుత్తమ చిత్రాల్లో దీన్నొకటిగా చెప్పొచ్చు. విడుదల తర్వాత క్లాసిక్ స్టేటస్ అందుకున్న ‘సూరారై పొట్రు’ను హిందీలోకి సూర్యనే తీసుకెళ్తున్నాడు.
సూర్య, ఆయన భార్య జ్యోతిక కలిసి ఓ బాలీవుడ్ నిర్మాణ సంస్థతో కలిసి ‘సూరారై పొట్రు’ను రీమేక్ చేయబోతున్నట్లు ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ఐతే హిందీలో ఎవరు హీరోగా నటిస్తారు అన్నది ఇంకా వెల్లడించలేదు. దర్శకత్వం మాత్రం సుధనే చేయబోతోంది. ఇండియాలో కొత్త సినిమాలు పెద్దగా లేని టైంలో ప్రైమ్‌లో రిలీజైన ఈ చిత్రాన్ని ఉత్తరాది ప్రేక్షకులు కూడా బాగా చూశారు.
ఇప్పుడు ప్రైమ్‌లో నాలుగు భాషల్లో ఈ చిత్రం అందుబాటులో ఉంది. ఇలాంటి సినిమాను మళ్లీ హిందీలోకి తీసుకెళ్తుండటం విశేషమే. ఐతే దక్షిణాది సినిమాల కథలు తీసుకుని.. వాటికి బాలీవుడ్ టచ్ ఇచ్చి కొంచెం భిన్నంగా ప్రెజెంట్ చేయడం బాలీవుడ్ వాళ్లకు అలవాటే. మరి ‘సూరారై పొట్రు’ హిందీ వెర్షన్లో ఎవరు నటిస్తారో చూడాలి.
This post was last modified on July 12, 2021 3:41 pm
కొద్ది రోజుల క్రితం రగులుకున్న మాయదారి కార్చిచ్చు.. అమెరికాలోని లాస్ ఏంజెలెస్ మహానగరం ఇప్పుడు మరుభూమిగా మార్చింది. సంపదతో తులతూగుతూ..…
పార్టీ పిరాయింపుల వ్యవహారం ఇద్దరు ఎమ్మెల్యేల మధ్య తీవ్ర వాగ్వావాదానికి దారి తీసింది. ముగ్గురు మంత్రులు, జిల్లా కలెక్టర్, ఎస్పీ,…
తిరుమల వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటపై ఏపీలో అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు…
తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులతో కిందా మీదా పడుతున్న పాకిస్థాన్ దశ తిరిగే విషయం వెలుగు చూసింది. ఆ దేశంలోని పంజాబ్…
అగ్రరాజ్యం అమెరికాలో ధనవంతులు నివసించే ప్రాంతం అది! కడుక్కున్న కాళ్లతో అక్కడ అడుగులు వేసినా ముద్రపడతాయేమో.. మట్టి అంటుతుందేమో.. అని…
ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర ప్రయాగ్‌రాజ్ జిల్లాలో సోమవారం(జనవరి 13) నుంచి 45 రోజుల పాటు జరగను న్న మహా కుంభమేళాకు సర్వం…