టాలీవుడ్ సీనియర్ విక్టరీ వెంకటేష్ కొత్త చిత్రాలు నారప్ప, దృశ్యం-2 ఓటీటీల్లో రిలీజ్ కాబోతున్నట్లు కొన్ని రోజుల కిందట జోరుగా ప్రచారం సాగిన సంగతి తెలిసిందే. ఈ రెండు చిత్రాల డిజిటల్ హక్కులను అమేజాన్ ప్రైమ్ సొంతం చేసుకుందని.. థియేట్రికల్ రిలీజ్ స్కిప్ చేసి ఓటీటీల్లో నేరుగా ఈ చిత్రాలను విడుదల చేయబోతున్నారని వార్తలొచ్చాయి. రెండు చిత్రాలను కలిపి రూ.75 కోట్లకు నిర్మాత సురేష్ బాబు అమ్మేసినట్లు కూడా చెప్పుకున్నారు. ఐతే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రాలేదు.
ఇదిలా ఉంటే.. పెద్ద నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీల్లో రిలీజ్ చేయడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న ఎగ్జిబిటర్లు.. నారప్ప, దృశ్యం-2 డీల్స్ విషయంలో ఆగ్రహంతోనే ఉన్నారు. ఓటీటీల బాట పడితే థియేటర్ ఇండస్ట్రీ నాశనమవుతుందని.. నిర్మాతలు పునరాలోచించుకోకుంటే తీవ్ర పరిణామాలు తప్పవని కూడా హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో సురేష్ బాబు పునరాలోచనలో పడ్డారని.. ‘నారప్ప’ ఓటీటీ డీల్ క్యాన్సిల్ చేసుకుంటున్నారని తాజాగా వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. ఎగ్జిబిటర్ల ఒత్తిడికి సురేష్ బాబు తలొగ్గి ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ఇది వాస్తవం కాదన్నది తాజా సమాచారం. ‘నారప్ప’ అమేజాన్ ప్రైమ్‌లోనే విడుదల కానుందట. ఈ నెల 24న రిలీజ్ చేయడానికి ముహూర్తం కూడా ఖరారైందట. ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టర్లు సైతం కనిపిస్తుండటం విశేషం.
అమేజాన్ ప్రైమ్ ‘నారప్ప’ ఓటీటీ రిలీజ్ గురించి యాడ్స్ కూడా రెడీ చేసిందని.. ఈ సినిమా డీల్ విషయంలో వెనక్కి తగ్గేదేమీ లేదని.. పక్కాగా ‘నారప్ప’ ప్రైమ్‌లోనే వస్తుందని అంటున్నారు. ఈ విషయమై ఇంకొన్ని రోజుల్లోనే అధికారిక ప్రకటన వస్తుందని కూడా తెలుస్తోంది. మరి ‘నారప్ప’ లాంటి పెద్ద చిత్రాన్ని ఓటీటీ రిలీజ్‌కు రెడీ చేస్తే ఎగ్జిబిటర్లు ఎలా స్పందిస్తారు.. వారికి సురేష్ బాబు ఏమని సమాధానం ఇస్తారు అన్నది చూడాలి.
This post was last modified on July 12, 2021 7:22 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…