అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ‘పుష్ప’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. రెండు భాగాలుగా రానున్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. శేషాచలం అడవుల్లో జరిగే ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ను విడుదల చేశారు. ఇందులో పుష్ప రాజ్ గా బన్నీ గెటప్ చూసిన ఫ్యాన్స్ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు.
ఈ సినిమా విషయంలో సుకుమార్ తన క్రియేటివిటీకి బాగా పదును పెట్టారు. బన్నీను ఇప్పటివరకు ప్రేక్షకులు చూడని డిఫరెంట్ రోల్ లో ప్రెజంట్ చేయబోతున్నారు. కథ ప్రకారం బన్నీ క్యారెక్టర్ లో నెగెటివ్ షేడ్స్ ఉంటాయట. దీనికి సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులను థ్రిల్ కి గురి చేస్తాయని చెబుతున్నారు. ఈ తరహా పాత్ర బన్నీ ఇది వరకెప్పుడూ చేయలేదు. భవిష్యత్తులోనూ చేయలేరేమో అన్నట్లుగా ఉంటుందట.
ఇక ఈ సినిమాలో బన్నీని ఢీ కొట్టే పాత్రలో మలయాళ స్టార్ ఫహద్ ఫాజిల్ కనిపించనున్నారు. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే ఎనభై శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా తాజాగా కొత్త షెడ్యూల్ ను మొదలుపెట్టింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ చేయనున్నారు.
This post was last modified on July 11, 2021 3:42 pm
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…