నటుడిగా కమల్ హాసన్ స్థాయి ఏంటో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఐదు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్లో ఆయన చేసిన పాత్రలు, ప్రయోగాల గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి నటుడితో ఈ తరంలో మేటి నటులుగా గుర్తింపు పొందిన విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్ కలిసి ‘విక్రమ్’ సినిమా చేస్తుండటం సినీ ప్రియులకు ఎక్కడ లేని ఎగ్జైట్మెంట్ కలిగిస్తోంది. ఈ సినిమాలో సేతుపతి నటిస్తున్నట్లు ఇంతకుముందు వార్తలేమీ రాలేదు.
‘విక్రమ్’లో ఫాహద్ విలన్ అని మాత్రమే చెప్పుకున్నారు. దానికే ప్రేక్షకుల ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఫాహద్ మలయాళ నటుడే కానీ.. గత దశాబ్ద కాలంలో అతను చేసిన అద్భుత పాత్రలతో దేశవ్యాప్త గుర్తింపు సంపాదించాడు. ముఖ్యంగా ఓటీటీల విప్లవం మొదలైన గత మూణ్నాలుగేళ్లలో ఫాహద్ ప్రతిభ వివిధ భాషల వాళ్లకు బాగా తెలిసిందే. కమల్ సినిమాలో అతను విలన్ అనగానే వారెవా ఏం కాంబినేషన్ అనుకున్నారు. తెరపై వీళ్లిద్దరూ తలపడితే ఆ మజానే వేరు అనిపించింది.
ఐతే ఇప్పుడు ఈ చిత్రంలో సేతుపతి కూడా ఉన్నాడు అని తెలిసేసరికి మూవీ లవర్స్ ఎగ్జైట్మెంట్ మామూలుగా లేదు. ఈ కాంబినేషన్ చూసి జనాలకు మెంటలెక్కిపోతోంది. సౌత్ ఇండియన్ ఆడియన్స్‌కు ఈ చిత్రం ఒక విజువల్ ఫీస్ట్ అనడంలో సందేహం లేదు.
ఇలాంటి ముగ్గురు నటుల్ని కలిపేలా లోకేష్ కనకరాజ్ ఏం కథ రాశాడు.. వాళ్ల పాత్రలు ఎలా ఉంటాయి.. పెర్ఫామెన్స్ విషయంలో ఈ ముగ్గురూ ఒకరితో ఒకరు పోటీ పడితే ఎలా ఉంటుంది అని అప్పుడే తెగ చర్చించేసుకుంటున్నారు జనాలు. కమల్, సేతుపతి, ఫాహద్ ముగ్గురూ కూడా ఆషామాషీ పాత్రలు ఒప్పుకునే రకం కాదు.
కాబట్టి వారి పాత్రలు ప్రేక్షకుల అంచనాలకు తగ్గట్లే ఉంటాయని ఆశించవచ్చు. ఈ కాంబినేషన్ కారణంగా సినిమా మొదలవుతున్నపుడే అంచనాలు పతాక స్థాయికి వెళ్లిపోయాయి. ఇక రిలీజ్ టైంకి హైప్ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయలేం. మరి ఈ హైప్‌కు తగ్గట్లే లోకేష్ కనకరాజ్ ఒక మెమొరబుల్ మూవీని అందిస్తారేమో చూద్దాం.
This post was last modified on July 11, 2021 12:06 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…