మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో దర్శకుడు కొరటాల శివ ‘ఆచార్య’ సినిమాను తెరకెక్కిస్తోన్న సంగతి తెలిసిందే. నిజానికి ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని ఈపాటికే ప్రేక్షకుల ముందుకు రావాల్సింది కానీ కరోనా కారణంగా వాయిదా పడుతోంది. ప్రస్తుతం కరోనా వ్యాప్తి తగ్గుముఖం పట్టి పరిస్థితులు నెమ్మదిగా మామూలు దశకు చేరుకుంటున్నాయి. దీంతో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ‘ఆచార్య’ చివరి షెడ్యూల్ ను మొదలుపెట్టారు.
ఇదిలా ఉంటే అసలు ఈ సినిమా మల్టీస్టారర్ గా ఎలా మారిందనే దానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. నిజానికి కొరటాల శివ ఈ సినిమాలో మహేష్ బాబు కోసం గెస్ట్ రోల్ రాసుకున్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. మహేష్ బాబు కూడా నటించడానికి ఒప్పుకున్నారట. కానీ చాలా కాలంగా మంచి కథ దొరికితే తన కొడుకుతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుందామనుకున్న చిరంజీవికి ‘ఆచార్య’ పెర్ఫెక్ట్ కథ అనిపించిందట.
అందుకే వెంటనే కొరటాల శివను పిలిపించి మహేష్ కి బదులుగా చరణ్ ను తీసుకోవాలని.. తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్లుగా స్క్రిప్ట్ ను డెవలప్ చేయమని అడిగారట చిరు. మెగాస్టార్ అడిగేసరికి కాదనలేకపోయిన కొరటాల ఆయన చెప్పినట్లుగానే చరణ్ కోసం రోల్ ను మరింత పెంచి రాసుకున్నారు. కథ ప్రకారం సినిమాలో మెయిన్ ఎమోషన్స్ చరణ్ చుట్టూనే తిరుగుతాయని తెలుస్తోంది. సినిమాలో చరణ్ చేయాలనుకుని.. చేయలేకపోయిన దాన్ని ‘ఆచార్య’గా చిరంజీవి ఎలా కొనసాగించాడనేది స్టోరీ. మణిశర్మ సంగీతం అందిస్తోన్న ఈ సినిమాలో కాజల్, పూజాహెగ్డే హీరోయిన్లుగా కనిపించనున్నారు.
This post was last modified on July 11, 2021 10:38 am
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…