Movie News

త్వరలో రాజమౌళితో కూర్చుంటా : వినాయక్

దశాబ్దంన్నర కిందట దర్శక ధీరుడు రాజమౌళి, ప్రభాస్‌ల కాంబినేషన్లో వచ్చిన ‘ఛత్రపతి’ ఎంత పెద్ద హిట్టయిందో తెలిసిందే. ఆ చిత్రం తమిళం, కన్నడ భాషల్లో రీమేక్ అయి రెండు చోట్లా విజయం సాధించింది. ఇప్పుడు ఈ చిత్రం హిందీలోకి వెళ్తున్న సంగతి తెలిసిందే.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా టాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని హిందీలో రీమేక్ చేస్తున్నాడు. బాలీవుడ్లో పేరు మోసిన సంస్థ అయిన పెన్ మూవీస్ ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌ను నిర్మిస్తుండటం విశేషం.

ఈ రీమేక్ కోసం ‘ఛత్రపతి’ ఒరిజినల్ రైటర్ విజయేంద్ర ప్రసాద్ కూడా పని చేస్తున్నట్లు దర్శకుడు వి.వి.వినాయక్ వెల్లడించాడు. బాలీవుడ్లో ‘భజరంగి భాయిజాన్’, ‘మణికర్ణిక’ లాంటి చిత్రాలకు పని చేసిన విజయేంద్రకు హిందీ ప్రేక్షకుల అభిరుచిపై మంచి అవగాహనే ఉంది. ఈ అనుభవంతోనే ‘ఛత్రపతి’ రీమేక్‌కు ఇన్‌పుట్స్ ఇచ్చారని.. ఆయనతో కలిసి స్క్రిప్టు మీద చర్చించామని.. విజయేంద్ర కొన్ని మార్పులు చేర్పులు కూడా సూచించారని వినాయక్ వెల్లడించాడు.

తన టీంతో కలిసి ఎంతో కసరత్తు చేశాకే ఈ రీమేక్‌ను పట్టాలెక్కిస్తున్నట్లు వినాయక్ తెలిపాడు. ఐతే ‘ఛత్రపతి’ ఒరిజినల్ డైరెక్టర్ రాజమౌళికి ఖాళీ లేక ఈ సినిమా గురించి ఆయనతో మాట్లాడలేదని.. త్వరలోనే రాజమౌళితో ఒకసారి కూర్చుంటానని వినాయక్ చెప్పాడు.

ఇక ‘ఛత్రపతి’ని హిందీలో రీమేక్ చేయాలని తాను కానీ, బెల్లంకొండ శ్రీనివాస్ కానీ అనుకోలేదని.. ఆ ప్రాజెక్టే తమ వద్దకు వచ్చిందని వినాయక్ చెప్పాడు. శ్రీనివాస్‌ డబ్బింగ్ సినిమాల ద్వారా హిందీలో మంచి గుర్తింపు సంపాదించాడని.. పెన్ మూవీస్ అధినేత జయంతిలాల్ గడ దగ్గర చాన్నాళ్ల నుంచే ‘ఛత్రపతి’ రీమేక్ హక్కులున్నాయని.. ఆయనే శ్రీనివాస్‌తో ఈ సినిమా చేయాలని అనుకుని సంప్రదించాడని.. తర్వాత తాను ఈ ప్రాజెక్టులోకి వచ్చానని వినాయక్ తెలిపాడు. పెన్ మూవీస్‌లోనే తాను మరో సినిమా చేయబోతున్నానని.. దాని వివరాలు త్వరలోనే వెల్లడిస్తానని ఆయనన్నాడు.

This post was last modified on July 10, 2021 9:26 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘అమ్మాయిలను అనుభవించడానికే సినిమాలు తీస్తున్నారు’

సినీ ప‌రిశ్ర‌మ‌లో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్ప‌లేమ‌ని సీనియ‌ర్ ద‌ర్శ‌క నిర్మాత త‌మ్మారెడ్డి భ‌ర‌ద్వాజ స్ప‌ష్టం చేశారు. ఇటీవ‌ల…

3 hours ago

డిప్యూటీ సీఎంగా అజిత్ పవార్ సతీమణి

బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…

5 hours ago

చంద్రబాబు ప్రయోగశాలగా మారిన కుప్పం

త‌న సొంత నియోజ‌కవ‌ర్గం కుప్పాన్ని ప్ర‌యోగ‌శాల‌గా మార్చ‌నున్న‌ట్టు సీఎం చంద్ర‌బాబు తెలిపారు. తాజాగా శుక్ర‌వారం రాత్రి త‌న నియోజ‌క‌వర్గానికి వ‌చ్చిన…

5 hours ago

కేసీఆర్ చెప్పిన‌ట్లు కుద‌ర‌దు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచార‌ణ విష‌యంలో తెలంగాణ‌ మాజీ ముఖ్య‌మంత్రి కేసీఆర్ పంతం నెగ్గ‌లేదు. త‌న‌ను ఎర్ర‌వెల్లిలోని త‌న ఫామ్…

6 hours ago

చరణ్ కోసం అఖిల్ త్యాగం చేస్తాడా?

రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…

6 hours ago

పోలీసులకు వార్నింగ్ ఇచ్చి సారీ చెప్పిన కౌశిక్ రెడ్డి!

వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…

8 hours ago