హిందీలో అత్యధిక చిత్రాల్లో నటించిన తెలుగు హీరో ఎవరంటే పెద్దగా ఆలోచించకుండానే అక్కినేని నాగార్జున పేరు చెప్పేస్తారు. 90ల్లో ఆయన వరుసగా హిందీలో నటించారు. తర్వాత గ్యాప్ వచ్చింది. ఈ మధ్యే ‘బ్రహ్మాస్త్ర’ అనే భారీ చిత్రంలో ఓ కీలక పాత్ర చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు నాగ్ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్య కూడా బాలీవుడ్లో అరంగేట్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఆమిర్ ఖాన్ లాంటి పెద్ద హీరో సినిమాలో అతడికి కీలక పాత్ర దక్కింది. ఆ చిత్రమే ‘లాల్ సింగ్ చద్దా’. చైతూ ఈ పాటికే ఈ సినిమా షూటింగ్‌లో పాల్గొనాల్సింది కానీ.. కరోనా కారణంగా ఆలస్యమైంది.
ఐతే ఎట్టకేలకు ‘లాల్ సింగ్ చద్దా’ సెట్స్‌లో అడుగు పెట్టాడు చైతూ. అంతే కాదు.. సెట్స్ నుంచి ఆమిర్‌తో అతను ఉన్న ఫొటో కూడా బయటికి వచ్చింది. ఈ ఫొటోలో ఇటీవలే ఆమిర్ నుంచి విడాకులు తీసుకున్న అతడి మాజీ భార్య కిరణ్ రావు, ‘లాల్ సింగ్ చద్దా’ డైరెక్టర్ అద్వైత్ చందన్ కూడా ఉన్నారు. ఆమిర్ మామూలు లుక్‌లోనే కనిపిస్తుండగా.. చైతూ బాగా మీసం పెంచి, క్లీన్ షేవ్‌లో దర్శనమిస్తున్నాడు. మ్యాన్లీగా ఉన్న చైతూ లుక్ ఆకట్టుకుంటోంది.
ఆమిర్, అతను ఆర్మీ డ్రెస్‌లో ఉండటం విశేషం. బహుశా ఇందులో చైతూ.. ఆర్మీలో పని చేసే సౌత్ ఇండియన్ పాత్ర పోషిస్తుండొచ్చని భావిస్తున్నారు. ముందు ఈ పాత్రకు విజయ్ సేతుపతిని అనుకోవడం విశేషం. ఈ సినిమాకు ఒప్పుకున్న సేతుపతి.. తర్వాత వేరే కారణాలతో వైదొలిగాడు. ఇక కిరణ్, తాను భార్యాభర్తలుగా విడిపోతున్నప్పటికీ.. ప్రొఫెషనల్‌గా కలిసే ఉంటామని, సినిమాలకు కలిసి పని చేస్తామని ఆమిర్ ఇప్పటికే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ ఫొటో చూస్తే అది నిజమే అనిపిస్తోంది. హాలీవుడ్ మూవీ ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కుతున్న ‘లాల్ సింగ్ చద్దా’ను ఈ ఏడాది క్రిస్మస్‌కు రిలీజ్ చేయాలనుకుంటున్నారు కానీ.. అది సాధ్యపడేలా కనిపించడం లేదు.
This post was last modified on July 9, 2021 4:50 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…