పూజాహెగ్డే జోరు మాములుగా లేదు!

టాలీవుడ్ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్ పూజాహెగ్డే వరుస ప్రాజెక్ట్ లను లైన్ లో పెడుతోంది. ఒక్కో సినిమాకి రెండున్నర నుండి మూడు కోట్లు తీసుకుంటున్న ఈ బ్యూటీని నిర్మాతలు ఏరికోరి మరీ తమ సినిమాల్లో ఎన్నుకుంటున్నారు. ప్రస్తుతం పూజాహెగ్డే చాలా బిజీగా ఉంది. ఓ పక్క టాలీవుడ్ మరోపక్క బాలీవుడ్ సినిమాలతో తీరిక లేకుండా గడుపుతోంది. రీసెంట్ గా కోలీవుడ్ లో విజయ్ తో ఓ సినిమా ఒప్పుకుంది.

ఈ సినిమాలు కాకుండా తాజాగా అమ్మడు మరో రెండు క్రేజీ ప్రాజెక్ట్ లు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మహేష్ బాబు-త్రివిక్రమ్ సినిమాలో పూజాను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ సినిమా తరువాత పవన్ కళ్యాణ్-హరీష్ శంకర్ సినిమా చేయబోతుంది పూజా. దీంతో పాటు తమిళ హీరో ధనుష్-వెంకీ అట్లూరి కాంబినేషన్ లో వస్తోన్న సినిమాకి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది.

ఈ మూడు సినిమాల డేట్స్ చూసుకొని అప్పుడు నితిన్ సినిమాకి కాల్షీట్స్ ఇవ్వాలో లేదో నిర్ణయించుకుంది. మహేష్ బాబు సినిమా పూర్తయ్యేనాటికి పవన్ కళ్యాణ్ సినిమా మొదలవుతుంది. దీంతో పాటే సమాంతరంగా ధనుష్ సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ పూర్తి చేసేలోపు ఆమెకి మరిన్ని ఛాన్స్ లు రావడం ఖాయం. ప్రస్తుతం ఈ బ్యూటీ ‘రాధేశ్యామ్’, ‘ఆచార్య’ సినిమా షూటింగ్ లలో పాల్గొంటుంది. అలానే బాలీవుడ్ లో ‘సర్కస్’, ‘భాయ్ జాన్’ లాంటి సినిమాల్లో నటిస్తోంది.