ఈ మధ్య కాలంలో ఓ సినిమాలో విలన్ పాత్ర చేయనున్న నటుడి గురించి అత్యంత చర్చ జరిగిందంటే పుష్ప సినిమా విషయంలోనే. ముందు విజయ్ సేతుపతితో మొదలై ఈ పాత్రకు చాలా పేర్లు వినిపించాయి. చివరికి మలయాళ విలక్షణ నటుడు ఫాహద్ ఫాజిల్‌ను ఈ పాత్రకు ఓకే చేశారు. గత కొన్నేళ్లలో అద్భుతమైన పాత్రలతో నటుడిగా గొప్ప పేరే సంపాదించాడు ఫాహద్. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలు చేయడంలో అతడి శైలే వేరు. అలాంటి మేటి నటుడిని సుకుమార్ సినిమాలో అల్లు అర్జున్‌తో తలపడే పాత్రలో చూడబోతుండటం పట్ల చాలా ఎగ్జైట్ అవుతున్నారు ప్రేక్షకులు.
పుష్ప విలన్‌గా ఫాహద్ పేరు ప్రకటించిన కొన్ని నెలలవుతోంది కానీ.. అతను ఇప్పటిదాకా షూటింగ్‌కు హాజరు కాలేదు. ఎట్టకేలకు అతను హైదరాబాద్‌లో అడుగు పెట్టాడు. పుష్ప టీంతో అతను కలిశాడు. జులై 8న, గురువారమే ఇది జరిగింది.
కాకపోతే ఫాహద్ నేరుగా పుష్ప సెట్స్‌లోకి వెళ్లిపోలేదు. అతడి మీద నేరుగా చిత్రీకరణ జరపట్లేదు సుకుమార్. ముందుగా లుక్ టెస్ట్, అలాగే ట్రయల్ షూట్ జరుగుతోంది. దీనికే కొన్ని రోజులు కేటాయించనున్నాడు. ఫాహద్ చేస్తున్న తొలి సినిమా ఇదే కావడం, పైగా నేపథ్యం కూడా కొత్తది కావడంతో కొంచెం హోమ్ వర్క్ చేశాకే రంగంలోకి దిగాలని అతను.. అలాగే సుకుమార్ భావించారట. అందుకే ఫాహద్ నేరుగా పుష్ప సెట్స్‌లోకి వెళ్లట్లేదని సమాచారం.
తెలుగు భాష, డైలాగుల విషయంలో కొంత కసరత్తు చేసి.. అలాగే పాత్రను అర్థం చేసుకుని.. లుక్ ఫైనలైజ్ చేసుకుని తర్వాత అతను షూటింగ్‌కు వస్తాడట. ఈ నెలాఖరుకు ఫాహద్ పుష్ప సెట్స్‌లోకి అడుగు పెట్టొచ్చని సమాచారం. ఈ లోపు ఫాహద్ ట్రయల్ షూట్‌ను పర్యవేక్షిస్తూనే.. అల్లు అర్జున్ అండ్ కోతో షూటింగ్ కొనసాగించనున్నాడు సుక్కు.
This post was last modified on July 9, 2021 11:03 am
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…