సౌత్ ఇండియాలో మరో పేరున్న చిత్రం ఓటీటీ బాట పట్టింది. సూపర్ స్టార్ రజినీకాంత్‌తో కబాలి, కాలా లాంటి భారీ చిత్రాలను రూపొందించిన పా.రంజిత్.. వీటి తర్వాత తీసిన సర్పాట్ట-పరంబరై డిజిటల్ రిలీజ్‌కు రెడీ అయిపోయింది. ఆర్య ప్రధాన పాత్రలో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన సర్పాట్ట జులై 22న అమేజాన్ ప్రైమ్‌లో విడుదల కానుంది. కొన్ని నెలల కిందటే పూర్తయిన సర్పాట్ట చిత్రాన్ని థియేటర్లలోనే విడుదల చేయాలనుకున్నారు.
కానీ కరోనా సెకండ్ వేవ్ దానికి బ్రేక్ వేసింది. మళ్లీ థియేటర్లు ఎప్పుడు తెరుచుకుంటాయో స్పష్టత లేకపోవడం, ఈలోపు ప్రైమ్ నుంచి మంచి ఆఫర్ రావడంతో నిర్మాతలు ఓకే అనేశారు. ఈ చిత్రంపై తమిళంలో భారీ అంచనాలే ఉన్నాయి. సర్పాట్టను తెలుగులోనూ అనువాదం చేయడం విశేషం.
చాలా ఏళ్ల కిందటి తరతరాలుగా బాక్సింగ్‌కు అంకితమైన ఓ కుటుంబ వారసత్వాన్ని కొనసాగిస్తూ అందులోకి అడుగు పెట్టిన యువకుడి జీవితం నేపథ్యంలో ఈ చిత్రం నడుస్తుంది. సర్పాట్ట కోసం ఆర్య తన అవతారాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. బాగా కండలు పెంచి చిత్రమైన లుక్‌లోకి మారాడు. దీని ప్రోమోలు చాలా ఆసక్తికరంగా అనిపించాయి. సీనియర్ నటుడు పశుపతి ఇందులో కీలక పాత్ర పోషించాడు.
కబాలి, కాలా తర్వాత పా.రంజిత్ చాలా టైం తీసుకుని చేసిన ఈ చిత్రంపై తమిళంలో మంచి అంచనాలే ఉన్నాయి. అమేజాన్ ప్రైమ్ ఈ నెలలో మరికొన్ని క్రేజీ సినిమాలను ఎక్స్‌క్లూజివ్‌గా రిలీజ్ చేస్తోంది. మలయాళంలో ఫాహద్ ఫాజిల్ నటించిన మాలిక్‌తో పాటు హిందీ చిత్రం తూఫాన్ వచ్చే వారం ప్రైమ్‌లో రిలీజవుతున్నాయి. తర్వాత సర్పాట్ట వస్తుంది. ఈ మూడు చిత్రాలూ ప్రేక్షకుల్లో బాగానే ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.
This post was last modified on July 9, 2021 11:00 am
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…