తెలంగాణలో లాక్ డౌన్ ఎత్తేసి రెండు వారాలు దాటింది. థియేటర్లు నడుపుకోవడానికి అనుమతి కూడా ఉంది. ఏపీలో కూడా తాజాగా కర్ఫ్యూ షరతులు సడలించారు. అయితే రెండు చోట్లా ఇంకా థియేటర్లు పునఃప్రారంభం కాలేదు. గత ఏడాది లాక్ డౌన్ తర్వాత థియేటర్లు తెరిచే విషయంలో ఆచితూచి వ్యవహరించిన తెలుగు రాష్ట్రాల ఎగ్జిబిటర్లు ఈసారి కూడా అదే ధోరణి ప్రదర్శిస్తున్నారు. థియేటర్ ఇండస్ట్రీ బాగా దెబ్బ తిన్న నేపథ్యంలో పరిశ్రమ నుంచి, ప్రభుత్వాల నుంచి మద్దతు కోరుతున్నారు ఎగ్జిబిటర్లు.
ఓవైపు కొత్త చిత్రాలను నిర్మాతలు ఓటీటీలకు ఇవ్వడం ఆపేయాలని కోరుతూ.. మరోవైపు కరెంటు బిల్లుల రద్దు, టికెట్ల రేట్ల విషయంలో వెసులుబాటు లాంటి డిమాండ్లను ప్రభుత్వాల ముందు ఉంచుతున్నారు. వీటిపై వచ్చే స్పష్టతను బట్టి ఇంకో రెండు వారాల్లో థియేటర్లు తెరుచుకోవచ్చని భావిస్తున్నారు.
మరి కొన్ని రోజుల్లో రెండు రాష్ట్రాల ప్రభుత్వాల నుంచి కరెంటు బిల్లుల రద్దు, టికెట్ల రేట్లలో వెసులుబాటుకు సంబంధించి సినీ పెద్దలు లిఖిత పూర్వక విన్నపాలు అందజేయనున్నారట. అగ్ర నిర్మాత సురేష్ బాబు నారప్ప సినిమా ఓటీటీ డీల్‌ను రద్దు చేసుకుంటున్నారన్న ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే. దీనిపై ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశముంది. ఇదే జరిగితే ఓటీటీ డీల్స్ విషయంలో మరింతమంది వెనక్కి తగ్గుతారని అంచనా వేస్తున్నారు.
కరెంటు బిల్లుల రద్దు, టికెట్ల రేట్ల విషయంలో ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తే.. ఈ నెల 23న, సినిమాలకు కలిసొచ్చే శుక్రవారం నాడు థియేటర్లను పునఃప్రారంభిస్తారని అంటున్నారు. తొలి వారం చెప్పుకోదగ్గ కొత్త చిత్రాలేమీ రిలీజ్ కాకపోవచ్చు. తర్వాతి వారానికి ఆల్రెడీ తిమ్మరసు సినిమా షెడ్యూల్ అయిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 9, 2021 10:25 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…