బాలీవుడ్ హీరోయిన్ సోనాక్షి సిన్హా తన పదేళ్ల కెరీర్ లో మంచి పాపులారిటీ సంపాదించుకుంది. అయితే ఈ మధ్యకాలంలో ఆమెకి అవకాశాలు బాగా తగ్గాయి. ప్రస్తుతం ఆమె చేతిలో ‘భుజ్ : ది ప్రైడ్ ఆఫ్ ఇండియా’ అనే ప్రాజెక్ట్ ఒక్కటే ఉంది. తాజాగా సోనాక్షి ఓ వెబ్ సిరీస్ లో నటించడానికి అంగీకరించినట్లు తెలుస్తోంది. ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ ‘హీరా మండి’ అనే పేరుతో ఓ వెబ్ సిరీస్ ను రూపొందించనున్నారు. పాకిస్థాన్ లోని లాహోర్ సిటీలో రెడ్ లైట్ ఏరియా నేపథ్యంలో ఈ సిరీస్ ను తెరకెక్కించనున్నారు.
సెక్స్ వర్కర్స్ ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నారనే కాన్సెప్ట్ తో సిరీస్ కొనసాగుతుంది. ఇందులో వేశ్య పాత్రలో నటించడానికి సోనాక్షి సిన్హా అంగీకరించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సిరీస్ లో హ్యూమా ఖురేషీని ఓ లీడ్ వేశ్య రోల్ కోసం ఎంపిక చేసుకున్నారు సంజయ్ లీలా భన్సాలీ. మరో ప్రధాన వేశ్య పాత్ర కోసం సోనాక్షిని సంప్రదించగా.. కథ విన్న వెంటనే ఆమె ఓకే చెప్పేసిందట. కథలో తన పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండడంతో సోనాక్షి అంగీకరించినట్లు తెలుస్తోంది.
వేశ్యగా కనిపించడంతో పాటు కథక్ డాన్సర్ గా కూడా కనిపించాల్సిన అవసరం ఉందని తెలుస్తోంది. దీనికోసం సోనాక్షి కథక్ నేర్చుకునే పనిలో పడ్డారు. గతంలో సంజయ్ లీలా భన్సాలీ డైరెక్ట్ చేసిన ‘రౌడీ రాథోడ్’ అనే సినిమాలో సోనాక్షి నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. మరి ఈసారి వీరి కాంబినేషన్ ఎలాంటి సక్సెస్ ను తీసుకొస్తుందో చూడాలి. ఈ సిరీస్ ను నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసే విధంగా చర్చలు జరుగుతున్నాయి!
This post was last modified on July 8, 2021 10:44 am
దేవర టైంలో ప్రత్యక్షంగా తనను పబ్లిక్ స్టేజి మీద చూసే అవకాశం రాలేదని ఫీలవుతున్న అభిమానుల కోసం ఇవాళ జూనియర్…
నిజమే.. లెక్కంటే లెక్కే. ఏదో చేతికి వచ్చినంత ఇచ్చుకుంటూ పోతే ఎక్కడో ఒక చోట బొక్క బోర్లా పడిపోతాం. అలా…
వైసీపీ మాజీ మంత్రి, కీలక నాయకుడు కాకాణి గోవర్ధన్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్పై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది.…
విజయ్ దేవరకొండ కెరీర్ ప్రస్తుతం ఎంత ఇబ్బందికరంగా ఉందో తెలిసిందే. లైగర్, ఫ్యామిలీ స్టార్ లాంటి భారీ డిజాస్టర్లతో అతను…
అవినీతి మకిలి అంటకుండా సాగితే…అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నా కడుపులో చల్ల కదలకుండా నిర్భయంగా ఉండొచ్చు. అదే అవినీతిలో నిండా…
దేశంలోని మెజారిటీ ముస్లిం మైనారిటీలు వ్యతిరేకించిన వక్ఫ్ సవరణ బిల్లుకు పార్లమెంటు ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రపతి ఈ బిల్లుపై…