టాలీవుడ్ లో కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన బండ్ల గణేష్ ఆ తరువాత నిర్మాతగా మారారు. ‘గబ్బర్ సింగ్’, ‘టెంపర్’ లాంటి హిట్ సినిమాలను నిర్మించారు. కొన్నేళ్లుగా సినీ నిర్మాణానికి దూరంగా ఉంటున్నారు బండ్ల గణేష్. చాలా రోజులుగా తన దేవర పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలని ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ కోసం ఇద్దరు, ముగ్గురు దర్శకులతో చర్చలు కూడా జరుపుతున్నారు బండ్ల గణేష్.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ బిజీగా ఉండడంతో బండ్ల గణేష్ కి ఎలాంటి కమిట్మెంట్ ఇవ్వలేకపోతున్నారు. గతేడాది మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో నటుడిగా రీఎంట్రీ ఇచ్చాడు బండ్ల గణేష్. ఇందులో కమెడియన్ గా కాసేపు వెండితెరపై కనిపించి నవ్వించారు. అయితే చాలా రోజులుగా బండ్ల గణేష్ ప్రధాన పాత్రలో సినిమా వస్తుందని వార్తలొస్తున్నాయి. కానీ ఈ వార్తలను ఆయన ఖండిస్తూనే ఉన్నారు.
తాజాగా ఓ కొత్త దర్శకుడు బండ్ల గణేష్ ను హీరోగా పెట్టి సినిమా తీయడానికి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. చిన్న బడ్జెట్ లో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. వెంకట్ అనే నూతన దర్శకుడు ఈ సినిమాతో పరిచయం కానున్నారు. కథ ప్రకారం.. కాంట్రవర్శియల్ అండ్ ఫన్నీ ఇమేజ్ ఉన్న రోల్ అది. ఈ పాత్రకు బండ్ల గణేష్ సూట్ అవుతారని ఆయన్ని సంప్రదించినట్లు తెలుస్తుంది. దీనిపై అధికార ప్రకటన వస్తుందేమో చూడాలి!
This post was last modified on July 8, 2021 9:38 am
ఈ మధ్య కాలంలో రెండు అతి పెద్ద హిట్ సినిమాలు ఏవయ్యా అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు మండాడి, బెత్లెహాం…
విజయవాడలో నిర్వహించిన ‘పేదల పట్టాల పండుగ’ సభలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే, చంద్రబాబు ప్రసంగిస్తుండగా సభా ప్రాంగణం సమీపంలో…
వైసీపీ నుంచి ఆ మాటకొస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని ప్రకటించిన రాజ్యసభ మాజీ సభ్యుడు వేణుంబాక విజయ సాయిరెడ్డి కొద్ది…
ఒక పెద్ద బ్లాక్ బస్టర్ సీక్వెల్ అంటే ఏ స్థాయిలో అంచనాలు ఉంటాయో వేరే చెప్పనక్కర్లేదు. బాహుబలి, పుష్ప, కెజిఎఫ్,…
ప్యాన్ ఇండియా జానర్ వల్ల భాషల మధ్య హద్దులు చెరిగిపోతున్నాయి. దర్శకులు ఒక వుడ్డుకే అంకితం కాకుండా ఇతర పరిశ్రమలకు…
వైసీపీ అధినేత జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్యకు సంబంధించి సంచలన ఆరోపణలు చేస్తున్న సునీల్ యాదవ్ వ్యవహారం…