సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ ఎన్నడూ లేని విధంగా వరుస సినిమాలతో బిజీ అవుతున్నారు. ఆయనకు హిట్ వచ్చినా.. ప్లాప్ వచ్చినా రెమ్యునరేషన్ విషయంలో ఎలాంటి డిమాండ్స్ చేయరు. ఆయనకు కథ నచ్చితే చాలు.. పారితోషికం గురించి పట్టించుకోరు. అందుకే నిర్మాతలు ఆయనతో కలిసి సినిమాలు చేయడానికి ఆసక్తి చూపుతుంటారు. ప్రస్తుతం బోయపాటి దర్శకత్వంలో ‘అఖండ’ సినిమాలో నటిస్తోన్న బాలయ్య చేతిలో మరో అరడజను సినిమాలు ఉన్నాయని తెలుస్తోంది.
యంగ్ హీరోలకు పోటీగా బాలయ్య వరుస ప్రాజెక్ట్ లు కమిట్ అవ్వడం విశేషం. ‘అఖండ’ పూర్తయిన తరువాత మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ సినిమా చేయబోతున్నారు. అలానే దిల్ రాజు బ్యానర్ లో మరో సినిమా ఒప్పుకున్నారు. వీటితో పాటు సి.కళ్యాణ్ తో ఓ ప్రాజెక్ట్ కోసం అడ్వాన్స్ తీసుకున్నారు. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్, ఏకే ఎంటర్టైన్మెంట్ సంస్థలు బాలయ్యకు భారీ అడ్వాన్స్ లు ఇచ్చాయి.
రాజ్ కందుకూరి సైతం బాలయ్య సినిమా ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల ఆయన బాలయ్యని కలిసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్ట్ పై ఇంకా క్లారిటీ రాలేదు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ కూడా బాలయ్యతో ఓ సినిమా చేయాలనుకుంటుంది. ఇవి కాకుండా మరికొందరు నిర్మాతలు బాలయ్య డేట్స్ కోసం ఎగబడుతున్నారు. బాలయ్య కమిట్మెంట్ ఇచ్చిన ప్రాజెక్టులకు ఇంకా కథలు సెట్ అవ్వాలి. అందుకే కొత్త సినిమాలేవీ ఒప్పుకోవడం లేదు బాలయ్య. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్ పూర్తి చేయడానికి ఆయనకు మరో మూడేళ్ల సమయం పట్టడం ఖాయం!
This post was last modified on July 7, 2021 7:27 am
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…
ఓ మూడేళ్ళ క్రితం దాకా టాలీవుడ్ టాప్ ప్లేస్ ఎంజాయ్ చేసిన పూజా హెగ్డేను వరస బ్లాక్ బస్టర్లు ఉక్కిరిబిక్కిరి…
ఇటీవలే చెస్ వరల్డ్ ఛాంపియన్ గా నిలిచిన గుకేష్ దొమ్మరాజు ఎందరో యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు. ఇతని నేపథ్యం గురించి…
ఒక పెద్ద హీరో సినిమా థియేట్రికల్ గా మంచి రన్ లో ఉన్నప్పుడు దానికి సంబంధించిన ఒరిజినల్ కంటెంట్ యూట్యూబ్…
నాగచైతన్య, దర్శకుడు చందూ మొండేటి కాంబినేషన్ లో రూపొందుతున్న తండేల్ లో కీలక ఘట్టం డిసెంబర్ 22 జరగనుంది. పవిత్ర…