కేజీఎఫ్ తెలుగునాట కూడా బాగా వసూలు చేసింది కానీ రికార్డులు ఏమీ సాధించలేదు. కన్నడ అనువాద చిత్రాల పరంగా చూస్తే మంచి పెర్ఫార్మన్స్ అని చెప్పాలి. అయితే ఈ సినిమా సీక్వెల్ కి క్రేజ్ ఉండడంతో కన్నడ నిర్మాతలు సీక్వెల్ అనువాద హక్కులకు భారీ మొత్తం డిమాండ్ చేస్తున్నారు.
మొదటి భాగాన్ని పంపిణీ చేసిన సాయి కొర్రపాటి రెండో భాగాన్ని కూడా రిలీజ్ చేయడానికి మంచి ఆఫర్ కూడా ఇచ్చారు. ఆయన ఇరవై కోట్ల వరకు ఆఫర్ చేసారని, కానీ నిర్మాతలు అంతకు రెట్టింపు అడిగారని, దాంతో అంతకు వర్కౌట్ అవదు అని చెప్పేసి ఆయన తప్పుకున్నారని సమాచారం. దిల్ రాజు లేదా అల్లు అరవింద్ ఈ సినిమా రైట్స్ తీసుకుంటారని కన్నడ నిర్మాత ఆశాభావంతో ఉన్నారు.
అయితే కరోనా కష్టాల తర్వాత తెలుగు సినిమాలకే రేట్లు పలకడం కష్టమయ్యేలా ఉంది. ఇక అనువాద చిత్రంపై అంత రిస్క్ చేయడానికి ఎవరు సాహసిస్తారు? ఎంత క్రేజ్ ఉన్న సినిమా అయినా కానీ ఏమాత్రం అటు ఇటు అయినా భారీ నష్టం ఖాయం కనుక కేజీఎఫ్నిర్మాత దిగి రాక తప్పదు.