ఓ వైపు ‘రాధేశ్యామ్’ చేస్తూనే.. గత ఏడాది కొన్ని నెలల వ్యవధిలో మూడు సినిమాలను ప్రకటించాడు ప్రభాస్. అప్పట్నుంచి ఆ మూడు చిత్రాల పనులూ సమాంతరంగా సాగుతున్నాయి. ప్రభాస్ మొత్తంగా నాలుగు చిత్రాలకు సంబంధించిన పనుల్లోనూ ఏదో రకంగా ఇన్వాల్వ్ అవుతూనే ఉన్నాడు. ‘రాధేశ్యామ్’ షూటింగ్ పూర్తి చేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తూనే.. సలార్, ఆదిపురుష్ చిత్రాలనూ కూడా కొంచెం ముందు వెనుకగా మొదలుపెట్టేశాడు. వీలును బట్టి ఒక్కోదాని షూటింగ్‌లో పాల్గొంటున్నాడు.
‘రాధేశ్యామ్’ షూటింగ్ రెండు వారాలు మాత్రమే మిగిలి ఉండగా కరోనా సెకండ్ వేవ్ అడ్డం పడింది. ఇటీవలే చిత్రీకరణ పున:ప్రారంభం కాగా.. ముందుగా ఈ చిత్రానికే డేట్లు కేటాయించాడు రెబల్ స్టార్. మరి కొన్ని రోజుల్లోనే ఆ సినిమా పూర్తవుతుందంటున్నారు. తర్వాత ప్రభాస్ కెమెరాను ఫేస్ చేయబోయేది ‘ఆదిపురుష్’ కోసమే. ఈ సినిమా కోసం భారీ షెడ్యూలే ప్లాన్ చేశారు.
ఐతే ప్రభాస్ రావడానికి ఇంకా టైం పట్టేలా ఉండగా.. ఈలోపే ‘ఆదిపురుష్’ టీం సెట్స్ లోకి అడుగు పెట్టేసింది. ముంబయిలో ఈ రోజు నుంచే ‘ఆదిపురుష్’ కొత్త షెడ్యూల్ మొదలుపెట్టేశారు. దీని గురించి అధికారికంగానే అప్‌డేట్ బయటికి వచ్చింది. ఈ చిత్రంలో ప్రభాస్‌కు జోడీగా సీత పాత్ర చేస్తున్న కృతి సనన్ మీద సీన్లు తీస్తున్నాడు ఓం రౌత్. సీన్ నంబర్ 33 అంటూ కృతి మీద తీస్తున్న సన్నివేశానికి సంబంధించిన క్లాప్ బోర్డ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ క్లాప్ బోర్డ్ చూసి అప్పుడే 32 సీన్లు తీసేసి, 33వ సన్నివేశానికి వెళ్లిపోయారా.. లేక ముందుగా మధ్యలో సీన్లు తీస్తున్నారా అని డిస్కషన్లు పెడుతున్నారు నెటిజన్లు.
మరోవైపు ఓం రౌత్ షూటింగ్‌కు వెళ్తూ తీసుకున్న సెల్ఫీని కూడా ట్విట్టర్లో షేర్ చేశాడు. ఈ సమాచారంతోనే #Adipurush హ్యాష్ ట్యాగ్ ట్విట్టర్లో ట్రెండ్ అవుతుండటం విశేషం. ప్రభాస్ వచ్చేలోపు అతను లేని చిన్న చిన్న సీన్లను తీసేసి.. తర్వాత కీలకమైన సన్నివేశాలు తీయబోతున్నాడట ఓం రౌత్. ‘ఆదిపురుష్’ కోసం కొన్ని రోజులు పని చేశాక ప్రభాస్ ‘సలార్’ను కూడా పున:ప్రారంభించబోతున్నాడు.
This post was last modified on July 3, 2021 6:42 pm
అగ్రరాజ్యం అమెరికాలో చోటు చేసుకున్న పరిణామాలు.. విదేశీ విద్యార్థులు, వృత్తి నిపుణులను ఇరకాటంలోకి నెడుతున్నాయి. మరో రెండు మూడు వారాల్లోనే…
జైలు శిక్ష ఏమిటి? అందులోనూ ఫిఫ్టీ-ఫిఫ్టీ ఏమిటి- అనే ఆశ్చర్యం అందరికీ కలుగుతుంది. కానీ, ఇది వాస్తవం. దీనికి సంబంధించి…
ఏపీలో రాజకీయ వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఎలా ఉన్నా.. అధికార పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలు మాత్రం కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే…
టీడీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పరిటాల రవి గురించి యావత్ ఉమ్మడి రాష్ట్రానికి తెలిసిందే. అన్నగారు ఎన్టీఆర్ పిలుపుతో…
క్రిస్మస్కు తెలుగులో భారీ చిత్రాల సందడి ఉంటుందని అనుకున్నారు కానీ.. ఈ సీజన్లో వస్తాయనుకున్న గేమ్ చేంజర్, తండేల్, రాబిన్…