ఒకే రోజులో 15 మూవీలు రిలీజ్ చేస్తున్న ప్రముఖ ఓటీటీ

ఒకే రోజున ఎన్ని సినిమాలు విడుదలవుతాయి. ఐదు.. పది.. అంతకు మించి ఆశించలేం. కానీ.. అంతకు మించి అన్నట్లుగా సంచలన ప్రకటనతో తెలుగు ప్రేక్షకుల నోటి నుంచి ‘ఆహా’ అనిపించే ప్రకటన చేసింది ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫాం ఆహా. అల్లుఅరవింద్.. మైహోం రామేశ్వరరావుల జాయింట్ వెంచర్ గా చెప్పే ఈ అచ్చ తెలుగు ఓటీటీ కంటెంట్ ఫ్లాట్ ఫాం మీద ఒకేరోజులో ఇన్ని మూవీలు విడుదల కావటం ఇదే తొలిసారిగా చెబుతున్నారు.

అయితే.. ఇందులో కొత్త సినిమాలతో పాటు కొన్ని పాత సినిమాలు కూడా ఉన్నాయి. తెలుగు ప్రేక్షకుల్ని అలరించేందుకు గత ఏడాది లాక్ డౌన్ టైంలో ఓటీటీ రంగంలోకి అడుగు పెట్టిన ఆహా.. మొదట్లో కాస్త నిదానంగా అడుగులు వేసినప్పటికి.. ఈ మధ్య కాలంలో మాత్రం మహా స్పీడ్ గా దూసుకెళుతోంది. వరుస పెట్టి వెబ్ సిరీస్ లు.. సినిమాలు విడుదల చేస్తూ.. తెలుగు ఎంటర్ టైన్ మెంట్ కంటెంట్ లో తనకు పోటీ వచ్చే అవకాశమే లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఒకేరోజులో ఇంత భారీగా విడుదలయ్యే ప్లాన్ చేసిన ఆహా.. రానున్న రోజుల్లో మరెన్ని సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.
ఇంతకూ ఆ 15 మూవీలు ఏవంటే..

 1. యుద్ధం శరణం
 2. అందాల రాక్షసి
 3. దిక్కులు చూడకు రామయ్య
 4. ఊహలు గుసగుసలాడే
 5. ఈగ
 6. బంగారు బుల్లోడు
 7. భైరవ ద్వీపం
 8. చిరునవ్వుతో
 9. ఘటోత్కచుడు
 10. కొబ్బరి బొండం
 11. రాజేంద్రుడు గజేంద్రుడు
 12. వినోదం
 13. వేటగాడు
 14. లీసా
 15. పొగరు