సౌత్‌లో ఉన్నంత వరకు గ్లామర్ డాల్‌గానే కనిపించింది తాప్సి పన్ను. కానీ బాలీవుడ్లోకి అడుగు పెట్టాక ఆమె ఇమేజే మారిపోయింది. అక్కడ మంచి మంచి పాత్రలతో తన ప్రత్యేకతను చాటుకుందామె. కంగనా రనౌత్ తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో అంతగా మెరుస్తున్నది తాప్సినే. కేవలం ఆమె పేరు మీద సినిమాలు నడిచిపోతున్నాయి. తాప్సి నటించిన కొత్త చిత్రం ‘హసీన్ దిల్‌రుబా’ ప్రేక్షకుల దృష్టిని బాగానే ఆకర్షించింది.
కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడి ఉండటంతో ఈ చిత్రాన్ని నెట్ ఫ్లిక్స్‌లో డిజిటల్ రిలీజ్‌కు రెడీ చేశారు. ఈ రోజు మధ్యాహ్నమే ‘హసీన్ దిల్‌రుబా’ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఐతే ఈ చిత్రం అంచనాలకు తగ్గట్లుగా లేదన్న ఫీడ్ బ్యాక్ వస్తోంది. తాప్సితో పాటు లీడ్ రోల్స్ చేసిన విక్రాంత్ మాస్సే, హర్షవర్ధన్ రాణేల పెర్ఫామెన్స్ గురించి బాగానే మాట్లాడుకుంటున్నప్పటికీ.. సినిమాకు మాత్రం మిక్స్‌డ్ రెస్పాన్స్ వస్తోంది.
ఒక వ్యక్తి మీద ప్రేమ ఒక స్థాయిని దాటిపోతే ఎలా ఉంటుందో చూపించే సినిమా ‘హసీన్ దిల్ రుబా’. కథ కొంచెం కొత్తగా ఉన్నప్పటికీ.. ప్రథమార్ధం వరకు కథనం బాగానే సాగినప్పటికీ.. ఆ తర్వాత సినిమా ఆసక్తిని నిలిపి ఉంచలేకపోయిందని అంటున్నారు. క్లైమాక్స్ మినహాయిస్తే ద్వితీయార్ధం అంతా ట్రాష్ అని విమర్శిస్తున్నారు. తాప్సి ఎప్పట్లాగే బాగా చేయగా.. విక్రాంత్ మాసే అదరగొట్టేశాడని అంటున్నారు.
ఈ చిత్రానికి కథ అందించింది రాఘవేంద్రరావు మాజీ కోడలు కనిక థిల్లాన్ కావడం విశేషం. గతంలో జీరో, జడ్జిమెంటల్ హై క్యా లాంటి సినిమాలకు ఆమె పని చేసింది. తెలుగులో తన మాజీ భర్త తీసిన ‘సైజ్ జీరో’కు కూడా ఆమే కథకురాలు. ఐతే ఆమె కథలు కొంచెం భిన్నంగా ఉంటాయి కానీ.. అవంత ఆసక్తికరంగా సాగవనే విమర్శలున్నాయి. ‘హసీన్ దిల్‌రుబా’ విషయంలో ఇప్పుడు దర్శకుడు వినిల్ మాథ్యూ కంటే కూడా కనికనే ఎక్కువగా విమర్శిస్తుండటం గమనార్హం.
This post was last modified on July 2, 2021 4:17 pm
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…
మంచి అందగాడు, పెర్ఫామెన్స్ విషయంలోనూ ఢోకా లేదు. అయినా నవదీప్ టాలీవుడ్లో అనుకున్నంత పెద్ద స్థాయికి వెళ్లలేకపోయాడు. తేజ మూవీ…
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మంచి జోష్ లో ఉన్నాడు. చెన్నై లవ్ స్టోరీ థియేట్రికల్ రన్ లో సూపర్…
నిన్న కొత్త సినిమాలు చాలా రిలీజయ్యాయి. మాములుగా అయితే థియేటర్లు కిటకిటలాడిపోవాలి. అయితే ఆక్యుపెన్సీలు కొంచెం నెమ్మదిగా ఉన్న నేపథ్యంలో…