గ్లోబల్ హీరోయిన్ ప్రియాంక చోప్రాకి ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. బాలీవుడ్ సినిమాల నుండి హాలీవుడ్ రేంజ్ కి వెళ్లింది. పాపులర్ సింగర్ నిక్ జోనస్ ను పెళ్లి చేసుకొని అమెరికాలోనే సెటిల్ అయిపోయింది. అమెరికన్ సినిమాలు, వెబ్ డ్రామాలు చేస్తూ బిజీగా ఉన్న ప్రియాంక చోప్రా యాడ్స్, ప్రమోషన్స్ ద్వారా ఇంకా ఎక్కువ సంపాదిస్తుందని తెలుస్తోంది. ప్రియాంక చోప్రాకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.
ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో ఆమెకి 65 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. అందుకే ఆమె షేర్ చేసే ఫోటోలు, వీడియోలు తెగ వైరల్ అవుతుంటాయి. ఇప్పుడు ఆ పాపులారిటీని క్యాష్ చేసుకుంటుంది ప్రియాంక. తన అకౌంట్ లో ఏదైనా ఒక కమర్షియల్ యాడ్ కి సంబంధించిన పోస్ట్ పెట్టాలంటే రూ.3 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటుందట. ఒక్క పోస్ట్ కి మూడు కోట్లు అంటే మాములు విషయం కాదు. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లు తమ అకౌంట్ లో పోస్ట్ లు పెట్టడానికి రూ.8 నుండి రూ.10 లక్షలు తీసుకుంటారు.
వారితో పోలిస్తే ప్రియాంక చోప్రా రెమ్యునరేషన్ ఎన్నో రెట్లు ఎక్కువ. మొత్తానికి కష్టపడకుండానే ప్రియాంక కోట్లు సంపాదించేస్తుంది. ఈమె కాకుండా ఇండియన్ క్రికెట్ టీమ్ కెప్టెన్ విరాట్ కొహ్లీ ఒక్కో పోస్ట్ కి రూ.5 కోట్లు తీసుకుంటారట. అలానే ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఒక్కో ఇన్స్టాగ్రామ్ కమర్షియల్ పోస్ట్ కి రూ.11.9 కోట్లు తీసుకుంటున్నారని తెలుస్తోంది.
This post was last modified on July 3, 2021 7:43 am
2024 ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీల కలయికలో ఏర్పడి ఎన్డీఏ కూటమి ఏపీలో ఘన విజయం సాధించింది. పార్టీ బలాబలాలు,…
తన పాత పాటలు ఏవైనా కొత్త సినిమాల్లో వాడుకుంటే అస్సలు ఊరుకోవట్లేదు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా. నోటీసులు ఇస్తున్నారు.…
జాతీయ సినీ అవార్డులు ప్రకటించినపుడల్లా.. ఫలానా సినిమాకు అన్యాయం జరిగింది, ఫలానా ఆర్టిస్టుకు అవార్డు ఇవ్వాల్సింది అనే చర్చ జరగడం…
వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ తయారీకి వాడిన నెయ్యిలో కల్తీ జరిగిందని ఆరోపణలు రావడంతో సుప్రీం కోర్టు ఆధ్వర్యంలో సిట్…
ఈ రోజుల్లో ఓ పెద్ద సినిమా నుంచి ఒక చిన్న అప్డేట్ ఇవ్వాలంటే దానికి ఎంత హడావుడి చేస్తారో? అప్డేట్…
సెన్సెక్స్ మాదిరి బంగారం ధరలు రాకెట్ వేగంతో దూసుకెళుతున్న వైనం ఇటీవల కాలంలో చోటు చేసుకుంటుంది. ఉదయం ఉన్న ధర…