Movie News

కేజీఎఫ్ దర్శకుడిపై కన్నడిగుల ఫైర్

‘కేజీఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల జనాల్ని, ప్రేక్షకులను ఆకర్షించిన దర్శకుడు ప్రశాంత్ నీల్. టాలీవుడ్ హీరోలు, నిర్మాతలు కూడా అతడి పట్ల ప్రత్యేక ఆసక్తిని ప్రదర్శిచారు. ప్రభాస్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ లాంటి అగ్ర హీరోలు అతడితో పని చేయడానికి ముందుకొచ్చినట్లు వార్తలొచ్చాయి. వీరిలో తారక్ నిజంగానే ప్రశాంత్‌తో సినిమాను ఓకే చేసుకున్నాడు. ఈ చిత్రం కోసం ప్రశాంత్‌కు మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పటికే అడ్వాన్స్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. తాను తారక్‌తో పని చేయబోతున్న విషయాన్ని నిన్న అతడి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పే క్రమంలో పరోక్షంగా వెల్లడించాడు ప్రశాంత్. ఐతే నిన్న తారక్ గురించి ప్రశాంత్ ట్వీట్ వేశాడో లేదో.. కన్నడ సినీ అభిమానుల్లో వేడి మొదలైంది. అదే పనిగా ప్రశాంత్‌ను టార్గెట్ చేసి తీవ్ర విమర్శలతో ట్వీట్లు వేస్తున్నారు.

ప్రశాంత్‌కు దర్శకుడిగా అవకాశమిచ్చింది, గుర్తింపు తెచ్చింది కన్నడ సినీ పరిశ్రమ అని.. ఐతే ‘కేజీఎఫ్’తో పేరు రాగానే అతడి దృష్టి టాలీవుడ్ హీరోల మీద పడిందని.. భారీ పారితోషకానికి ఆశపడి ఎన్టీఆర్‌తో సినిమాకు రెడీ అయిపోయాడని వాళ్లు విమర్శిస్తున్నారు. ఇక్కడ ఎంతోమంది స్టార్లు ఉండగా.. వెంటనే తెలుగులో సినిమా చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని అంటున్నారు. అతను కన్నడ సినిమాను వాడుకుని వెళ్లిపోతున్నాడని ఆరోపిస్తున్నారు. ఇంతకుముందు రష్మిక మందన్నా కూడా ఇదే పని చేసిందని.. కన్నడ సినిమాలో ఫేమ్ రాగానే టాలీవుడ్ వైపు చూసిందని.. అక్కడ కొంచెం పేరు రాగానే పారితోషకాలకు ఆశపడి అక్కడే సెటిలైపోయిందని గుర్తు చేస్తున్నారు. ఆమెతో ప్రశాంత్‌ను పోలుస్తూ ఏకిపడేస్తున్నారు. ‘గెటౌట్ ప్రశాంత్ నీల్’ అని హ్యాష్ ట్యాగ్ పెట్టి అతడిని తిట్టిపోస్తున్నారు. ఐతే దీనికి కౌంటర్‌గా తెలుగు అభిమానులు ‘వెల్కం టు టీఎఫ్ఐ ప్రశాంత్ నీల్’ అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టి ట్వీట్లు గుప్పిస్తుండటం విశేషం.

This post was last modified on May 21, 2020 8:19 pm

Share
Show comments
Published by
suman

Recent Posts

పార్ట్ 2 మంత్రం పని చేయలేనట్టేనా…?

విడుదల పార్ట్ 1 వచ్చినప్పుడు తెలుగులో మంచి ప్రశంసలు దక్కాయి. కమర్షియల్ గా సూపర్ హిట్ కాదు కానీ నష్టాలు…

16 minutes ago

వైల్డ్ ఫైర్ ఎఫెక్ట్ : ఆంధ్ర వైపు సంక్రాంతి సినిమాల చూపు!

పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె తనయుడు చావు బతుకుల మధ్య…

37 minutes ago

ఉదయం 4 గంటలకు డాకు మహారాజ్ షోలు : సాధ్యమేనా?

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వాలు మారాక బెనిఫిట్ షోలు, అదనపు రేట్లకు సులువుగానే అనుమతులు వచ్చేస్తుండడంతో టాలీవుడ్ నిర్మాతలు చాలా…

52 minutes ago

పుష్ప కాదు జై భీమ్ హీరో అంటోన్న సీతక్క!

తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…

2 hours ago

చిరంజీవి ఫ్యాన్స్ తిట్టుకున్నా సరే..

మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…

3 hours ago

రేవంత్ దగ్గరికి సినీ పెద్దలు?

పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…

3 hours ago