బాలీవుడ్లో చాలామంది స్టార్లు, సూపర్ స్టార్లు ఉన్నారు. కానీ ప్రస్తుత హీరోల్లో ఫ్యాషన్ ఐకాన్ ఎవరు అంటే మాత్రం అందరూ రణ్వీర్ సింగ్ వైపే చూపిస్తారు. ఏ బ్యాగ్రౌండ్ లేకుండా బాలీవుడ్లోకి అడుగు పెట్టి.. కెరీర్ ఆరంభంలోనే మంచి విజయాలందుకుని పెద్ద స్టార్‌గా ఎదిగిన అతను.. ఫ్యాషన్ విషయంలో మిగతా హీరోలను వెనక్కి నెట్టి ముందుకెళ్లిపోయాడు. టిపికల్ డ్రెస్సింగ్, మేకప్‌తో అతను చేసే ఫ్యాషన్ ఫొటో షూట్లు యువత దృష్టిని బాగా ఆకర్షిస్తుంటాయి.
కొంచెం డిఫరెంట్‌గా ఉండాలనుకునేవాళ్లంతా అతణ్ని ఫాలో అవుతుంటారు. ఐతే కొన్నిసార్లు కొత్తగా అనిపించినా.. మరి కొన్నిసార్లు మాత్రం రణ్వీర్ సింగ్ డ్రెస్సింగ్, మేకప్ అతిగా అనిపిస్తుంటాయి. ఫ్యాషన్ పేరుతో మరీ శ్రుతి మించిపోయి చూసే జనాలకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంటుంది అతడి అవతారం. తాజాగా అతను చేసిన ఫొటో షూట్ ఆ కోవకే చెందుతుంది.
ప్రముఖ ఇటాలియన్ ఫ్యాషన్ డిజైనర్ అలెశాండ్రో మిచెల్‌ను ప్రేరణగా తీసుకుని అతడి తరహాలో డ్రెస్సింగ్, హెయిర్‌స్టైల్‌తో కనిపించిన రణ్‌వీర్‌ను చూసి అందరూ అవాక్కవుతున్నారు. ఆ డ్రెస్సింగ్, హేర్ స్టైల్, గడ్డం మరీ ఆడ్‌గా ఉండి ఇదేం ఫ్యాషన్ అంటూ జనాలు జుట్టు పీక్కునేలా చేస్తోంది. కొత్తదనం పేరుతో మరీ ఇంత శ్రుతి మించాలా అంటూ రణ్వీర్ మీద కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు. ఐతే రణ్వీర్ సింగ్ ఇలాంటి కామెంట్లను పట్టించుకునే రకం కాదు.
కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్లీ ఇలాంటి చిత్రమైన అవతారాలతో పలకరించడం అతడికి మామూలే. కెరీర్ విషయానికి వస్తే రెండేళ్ల కిందట ‘టెంపర్’ రీమేక్ ‘సింబా’తో అతను భారీ విజయాన్నందుకున్నాడు. ఆ తర్వాత కపిల్ దేవ్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ‘83’లో నటించాడు. ఏడాది ముందే విడుదల కావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. త్వరలోనే ‘83’ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశముంది.
This post was last modified on July 1, 2021 10:14 pm
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…