రామాయణం మీద ఇండియాలో వివిధ భాషల్లో చాలా సినిమాలే వచ్చాయి ఇప్పటిదాకా. ఐతే వాటన్నింటినీ తలదన్నేలా భారీ స్థాయిలో రామాయణ గాథకు వెండితెర దూరం ఇవ్వాలని కొన్నేళ్ల కిందట టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్, తెలుగువాడే అయిన బాలీవుడ్ ప్రొడ్యూసర్ మధు మంతెన తలపోశారు.
వీరి నిర్మాణంలో దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్లో రామాయణం మీద సినిమా తెరకెక్కబోతున్నట్లు అధికారిక ప్రకటనే వచ్చింది. కానీ ఆ సినిమా పట్టాలెక్కడంలో ఆలస్యం జరుగుతోంది. మధ్యలో చాలా కాలం పాటు ఈ సినిమా గురించి చప్పుడు లేకపోవడంతో ఈ ప్రాజెక్టు ఆగిపోయిందనే ప్రచారం కూడా జరిగింది.
కానీ ఆ ప్రచారాన్ని ఖండిస్తూ మళ్లీ అప్ డేట్స్ ఇస్తున్నారు. ఇందులో కాస్టింగ్ గురించి ఇప్పటికే కొన్ని ఊహాగానాలు నడిచాయి. ఐతే నిర్మాతల్లో ఒకరైన మధు మంతెన తాజాగా తమ చిత్రం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఇండియాలో ఇప్పటిదాకా ఎన్నడూ చూడనంత భారీ స్థాయిలో ఈ సినిమాను తీర్చిదిద్దుతామని.. అలాగే ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోని అత్యంత పెద్ద స్టార్లు ఈ సినిమాలో నటిస్తారని మధు చెప్పాడు. ఈ ఏడాది దీపావళి నాడు తమ రామాయణంలో ముఖ్య పాత్రలు పోషించే నటీనటుల వివరాలు వెల్లడిస్తామని కూడా మధు తెలిపాడు. ఈ చిత్రానికి ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నట్లు వెల్లడించిన మధు.. ఆస్కార్ విన్నింగ్ టెక్నీషియన్లు ఈ ప్రాజెక్టు కోసం పని చేస్తున్నట్లు వెల్లడించాడు.
కాగా ఈ సినిమాకు దర్శకుడిగా ముందు దంగల్ ఫేమ్ నితీశ్ తివారి పేరు మాత్రమే ప్రచారంలో ఉంది. కానీ రవి ఉడ్యార్ సైతం ఈ చిత్రానికి దర్వకత్వం వహిస్తాడని.. ఇద్దరూ కలిసి ఈ భారీ చిత్రాన్ని తీర్చిదిద్దుతారని మధు వెల్లడించాడు. హృతిక్ రోషన్, మహేష్ బాబు, దీపికా పదుకొనే లాంటి తారలు ఈ సినిమాలో నటిస్తారని ప్రచారం సాగిన సంగతి తెలిసిందే.
This post was last modified on July 1, 2021 11:55 am
బాలీవుడ్ లో అత్యంత వేగంగా 600 కోట్ల గ్రాస్ దాటిన తొలి ఇండియన్ మూవీగా రికార్డు సృష్టించిన పుష్ప 2…
వైసీపీ మాజీ మంత్రి, ఫైర్ బ్రాండ్ నేత అంబటి రాంబాబు తన దూకుడు స్వభావంతో, వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.…
పార్లమెంట్ లో అధికార, ప్రతిపక్ష కూటములకు చెందిన ఎంపీల మధ్య ఉద్రిక్తత తారస్థాయికి చేరింది. ఈ ఘటనలో బీజేపీ ఒడిశా…
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు బుచ్చిబాబు కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ మొదటి షెడ్యూల్ ని…
పార్లమెంటులో బీఆర్ అంబేద్కర్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి…
దేశ చరిత్రలో.. ముఖ్యంగా ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా పరిఢవిల్లుతున్న భారత దేశంలో తొలిసారి ఎవరూ ఊహించని ఘటన..…