స్టార్ హీరోల సినిమాలకు సంబంధించి మేకింగ్ టైంలో ఏ చిన్న విశేషం లీక్ అయినా అది వైరల్ అయిపోతుంది. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమాల పట్ల ప్రేక్షకుల్లో ఉండే ఆసక్తి ఎలాంటిదో తెలిసిందే. ‘పింక్’ సినిమాకు సంబంధించి అప్పట్లో లొకేషన్ నుంచి బయటికొచ్చిన ఒక పిక్ ఎంతటి సంచలనం రేపిందో గుర్తుండే ఉంటుంది.
అంతగా క్లారిటీ లేని ఆ పిక్ వైరల్ అవగా.. స్పోర్టివ్‌గానే తీసుకున్న చిత్ర బృందం దాన్నే టైటిల్ లోగోలో పెట్టేయడం విశేషం. మేకింగ్ టైంలో ఒక ఫైట్‌కు సంబంధించిన వీడియో సైతం అప్పట్లో వైరల్ అయింది. కాగా ఇప్పుడు పవన్ నటిస్తున్న కొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’ నుంచి కూడా ఒక వీడియో బయటికి వచ్చి సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. ఈ చిత్రంలో పవన్ మల్ల యోధులతో పోరాడే సన్నివేశాలుంటాయని ఇంతకుముందే సంకేతాలు అందాయి. పవన్ బరిసె పట్టుకుని పోజులిస్తున్న ఫొటోలు.. అలాగే మల్ల యోధుల ఫొటోలు అధికారికంగానే విడుదలయ్యాయి.
కాగా ఇప్పుడు ఆ యోధులతో పవన్ పోరాడే సన్నివేశాలకు సంబంధించి ఒక చిన్న వీడియో బయటికి వచ్చింది. ఒకవైపు ఆరేడుగురు మల్ల యోధులు సై అంటుంటే.. మరోవైపు పవన్ నిలబడి ఉన్నాడు ఆ వీడియోలో. చుట్టూ మనుషులు కిందికి వంగి కాళ్ల మీద కూర్చున్నారు. చూస్తుంటే ఇది ఒక కీలకమైన పోరాట దృశ్యానికి సంబంధించింది లాగుంది.
‘హరిహర వీరమల్లు’ కొన్ని దశాబ్దాల కిందటి నేపథ్యంతో తెరకెక్కుతున్న సినిమా. ఇందులో పోరాట దృశ్యాలే హైలైట్ అని ఆ మధ్య రిలీజ్ చేసిన టీజర్‌తోనే స్పష్టమైంది. ఇంతకుముందు రిలీజ్ చేసిన ఫొటోలు, ఇప్పుడు బయటికి వచ్చిన వీడియో చూశాక క్రిష్ ఇందులో యాక్షన్ ఘట్టాలను గట్టిగానే ప్లాన్ చేసినట్లు స్పష్టమవుతోంది. ఎ.ఎం.రత్నం నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ఐతే కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో సినిమా ఆలస్యమయ్యేలా ఉంది.
This post was last modified on June 28, 2021 3:12 pm
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…
దసరా తర్వాత నేచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో వచ్చిన ది ప్యారడైజ్ సినిమా మిశ్రమ స్పందన…
హెడ్డింగ్ చూడగానే ఏంటీ పొగడ్తనే అనుమానం రావొచ్చు కానీ అసలు విషయం తెలుసుకున్నాక నిజమే అనుకోక మానరు. విషయం ఏమిటంటే…
గత ఎన్నికల్లో ఓటమి పాలైన డీఎంకే అధినేత స్థాలిన్ దాన్నుంచి ఎలాంటి గుణపాఠం నేర్చుకున్నట్లు లేదు. ఆయన, ఆయన కుమారుడు…