పవన్ కళ్యాణ్ మళ్లీ సినిమాలు చేయాలని నిర్ణయించుకున్నాక ఖరారు చేసుకున్న ప్రాజెక్టుల్లో ఆయన అభిమానులను ఎంతో ఎగ్జైట్ చేసిన సినిమా అంటే హరీష్ శంకర్ దర్శకత్వంలో చేయనున్నదే. గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత ఈ కాంబోలో సినిమా అంటే అంచనాలు ఎలా ఉంటాయో చెప్పేదేముంది? అసలు పవన్ రీఎంట్రీ మూవీ ఇదే అయితే బాగుండని అభిమానులు కోరుకున్నారు. కానీ ఈ సినిమా అనుకున్న దాని కంటే చాలా ఆలస్యం అవుతూ వచ్చింది.
ముందుగా వకీల్ సాబ్ పని ముగించిన పవన్.. ఆ తర్వాత హరహర వీరమల్లు, అయ్యప్పనుం కోషీయుం రీమేక్‌లో నటిస్తున్నాడు. ఇవి పూర్తయ్యాకే హరీష్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు. ఐతే ఎంత ఆలస్యం అయినప్పటికీ.. వేరే ప్రాజెక్టు చూసుకోకుండా ఈ సినిమా మీదే తన ఫోకస్ మొత్తం పెట్టేసి కూర్చున్నాడు హరీష్.
ఈ సినిమా ఆలస్యం అవుతున్నప్పటికీ.. దాని విషయంలో పవన్ అభిమానుల్లో ఎగ్జైట్మెంట్ తగ్గకుండా చూసుకుంటున్నాడు హరీష్. కొన్ని సినిమా వేడుకల్లో.. ట్విట్టర్లో పవన్‌తో చేయబోయే సినిమా ఎలా ఉండబోతోందో హింట్లు ఇస్తున్నాడతను. అభిమానుల ఆకాంక్షలకు తగ్గట్లే సినిమా ఉంటుందని.. తాను కూడా ఒక అభిమాని లాగే ఈ సినిమా తీయబోతున్నానని ఇంతకుముందు చెప్పిన హరీష్.. తాజాగా తన సినిమాలో పవన్ పాత్ర ఎలా ఉండబోతోందో సంకేతాలు ఇచ్చాడు.
బద్రి సినిమాలో పవన్ యాటిట్యూడ్ చూపించే షాట్లతో ఒక షో రీల్ వీడియోను హరీష్ పంచుకున్నాడు. ఈ ఎనర్జీని మళ్లీ చూద్దాం అంటూ హరీష్ కామెంట్ పెట్టడం విశేషం. దీంతో పవర్ స్టార్ అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. హరీష్ సినిమాలో పవన్ యాటిట్యూడ్, ఎనర్జీకి లోటుండదంటూ పోస్టులు పెడుతూ ఎగ్జైట్ అవుతున్నారు. పవన్ మేనల్లుడు సాయిధరమ్ తేజ్ సైతం హరీష్ పోస్టు చూసి వెయిటింగ్ అంటూ ట్వీట్ వేయడం విశేషం.
This post was last modified on June 27, 2021 2:14 pm
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ చుట్టూ మరింత ఉచ్చు బిగుస్తోంది. సంధ్య ధియేటర్ ఘటనపై ఇప్పటికే ఏ11గా కేసు నమోదు…