ప్రభాష్ చేతిలో ఉన్న భారీ చిత్రాల్లో ‘ఆదిపురుష్’ ఒకటి. ‘బాహుబలి’తో పాన్ ఇండియా లెవెల్లో తిరుగులేని ఇమేజ్ సంపాదించుకున్నాక ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సిినమాలే చేస్తున్నాడు కానీ.. వాటిలో చాలా వరకు బేసిగ్గా తెలుగులో తెరకెక్కుతున్న చిత్రాలే ఉన్నాయి. ఒక్క ‘ఆదిపురుష్’ మాత్రమే మనం పరభాషా చిత్రంగా చెప్పుకోవాలి. ఇది ప్రధానంగా హిందీలో తెరకెక్కుతున్న చిత్రం. మిగతా భాషల్లోకి అనువాదం చేస్తున్నారు. దీన్ని రూపొందిస్తున్నది బాలీవుడ్ దర్శకుడైన ఓం రౌత్. నిర్మాతలూ అక్కడి వాళ్లే.
ఐతే ఈ చిత్రాన్ని పాన్ ఇండియా లెవెల్లో తీయాలనుకున్నపుడు దక్షిణాది భాషలకు చెందిన నటీనటుల్ని కూడా ఎంచుకోవాల్సింది. కానీ పూర్తిగా బాలీవుడ్ నటులతోనే ఈ చిత్రాన్ని నింపేస్తున్నారు. కథానాయిక కృతి సనన్‌కు సౌత్‌లో పెద్ద గుర్తింపేమీ లేదు. తెలుగులో రెండు సినిమాలు చేసినా కూడా అవి డిజాస్టర్లవడంతో ఆమెను ఇక్కడి వాళ్లు గుర్తుంచుకోలేదు.
ఇక విలన్ పాత్రలో నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్, అభిమన్యుడి పాత్ర పోషిస్తున్న సన్నీ సింగ్ బాలీవుడ్ నటులే. ఇప్పుడేమో ఈ చిత్రంలో మరో కీలక పాత్ర కోసం మరాఠీ నటుడైన దేవ్ దత్‌ను సెలక్ట్ చేశాడట దర్శకుడు ఓం రౌత్. దేవ్ దత్ చేయబోయేది హనుమంతుడి పాత్ర కావడం విశేషం. రామాయణ గాథలో హనుమంతుడి పాత్ర ఎంత కీలకమో తెలిసిందే. కనీసం ఈ పాత్రకైనా దక్షిణాది నుంచి ఎవరో ఒకరిని ఎంచుకోవాల్సిందిది.
ఇలా పూర్తిగా నార్త్ ఇండియా వాళ్లతో నింపేస్తే మన తెలుగు వాళ్లు, సౌత్ ప్రేక్షకులు ‘ఆదిపురుష్’తో ఏమాత్రం కనెక్ట్ అవుతారన్నది సందేహం. ఒక్క ప్రభాస్‌ను చూసి ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టేస్తారనుకుంటే పొరబాటే. అసలే హిందీ సినిమా, పైగా పూర్తిగా నార్త్ ఇండియన్ నటులు ఉంటే ఈ చిత్రంతో మన వాళ్లు కనెక్ట్ కారేమో అన్న డౌట్లు కొడుతున్నాయి. ఈ సినిమాకు టెక్నీషియన్లు కూడా పూర్తిగా బాలీవుడ్ వాళ్లే పని చేస్తుండటం గమనార్హం.
This post was last modified on June 27, 2021 7:46 am
జగన్ పాలనలో పర్యాటక రంగం కుదేలైందని, టూరిజం శాఖను నిర్వీర్యం చేశారని టీడీపీ, జనసేన నేతలు విమర్శించిన సంగతి తెలిసిందే.…
అదానీ వివాదం తెలంగాణ రాజకీయాల్లో కూడా హాట్ టాపిక్ గా మారింది. 100 కోట్ల రూపాయలను స్కిల్ యూనివర్సిటి కోసం…
మంచు విష్ణు ప్రతిష్టాత్మక ప్యాన్ ఇండియా మూవీ కన్నప్ప నుంచి పాత్రలకు సంబంధించిన కొత్త పోస్టర్లు వస్తూనే ఉన్నాయి కానీ…
మీడియా ప్రతినిధులపై ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తొలిసారిగా సెటైరికల్ వ్యాఖ్యలు చేశారు. అదానీపై కేసు, మాజీ సీఎం…
ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ తన భార్య సైరా భానుతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించడం ఫ్యాన్స్ ను…