‘ఆర్ఆర్ఆర్’ తర్వాత రామ్ చరణ్.. తమిళ లెజెండరీ డైరెక్టర్ శంకర్‌తో ఓ సినిమాకు రంగం సిద్ధం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇంకో నెలా రెండు నెలల్లో ‘ఆర్ఆర్ఆర్’ పని పూర్తి చేసేసి శంకర్ సినిమాను మొదలు పెట్టాలని అనుకుంటున్నాడు చరణ్. కానీ శంకర్ ఆ సమయానికి సినిమాను ఆరంభించే స్థితిలో ఉంటాడా అన్నది సందేహంగానే ఉంది. ‘ఇండియన్-2’ సంగతేంటో తేల్చకుండా శంకర్ వేరే సినిమా చేయడానిక వీల్లేదంటూ దాని నిర్మాతలైన లైకా ప్రొడక్షన్స్ అధినేతలు న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే.
తెలుగు ఫిలిం ఛాంబర్లోనూ ఈ విషయమై ఫిర్యాదు చేసి చరణ్ సినిమాను శంకర్ మొదలుపెట్టకుండా గట్టి ప్రయత్నమే చేస్తున్నారు లైకా అధినేతలు. ఈ నేపథ్యంలో చరణ్-శంకర్ సినిమా మీద సందిగ్ధత నెలకొంది. కాగా ఇప్పుడు మరో టాలీవుడ్ కథానాయకుడికి ఇలాగే ఓ తమిళ దర్శకుడితో తలనొప్పి తప్పేలా లేదు. ఆ హీరో రామ్ కాగా.. దర్శకుడు లింగుస్వామి.
రామ్-లింగుస్వామి కలయికలో సినిమా గురించి కొన్ని నెలల కిందటే ప్రకటన రావడం తెలిసిందే. ఇటీవలే లింగుస్వామి తనకు స్క్రిప్ట్ ఫైనల్ నరేషన్ ఇచ్చాడని.. తనకది బాగా నచ్చిందని.. త్వరలోనే సినిమా మొదలుపెడతామని రామ్ ట్విట్టర్లో వెల్డడించాడు కూడా. ఐతే ఈలోపు లింగుస్వామికి బ్రేక్ వేసేలా కనిపిస్తున్నాడు తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా. సూర్య కజిన్ అయిన జ్ఞానవేల్‌కు, లింగుస్వామికి మధ్య చాన్నాళ్లుగా ఓ వివాదం నడుస్తోంది.
సూర్య హీరోగా లింగుస్వామి దర్శకత్వంలో జ్ఞానవేల్ నిర్మించిన ‘సికిందర్’ పెద్ద డిజాస్టర్ కావడం తెలిసిందే. ఆ సినిమాకు సంబంధించిన ఆర్థిక పరమైన విషయాల్లో జ్ఞానవేల్‌కు, లిగుస్వామికి గొడవలున్నాయి. అవి పరిష్కారం అయ్యే వరకు లింగుస్వామి ఇప్పుడు వేరే సినిమా చేయడానికి వీల్లేదంటూ తమిళ ఫిలిం ఛాంబర్లో లింగుస్వామి ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ వివాదం పరిష్కరించుకున్నాక కానీ లిగుస్వామి.. రామ్ సినిమాను మొదలుపెట్టడానికి వీల్లేని పరిస్థితి నెలకొంది.
This post was last modified on June 27, 2021 7:38 am
సోషల్ మీడియా ప్రపంచంలో నెగటివిటీ ఎంతగా పెరిగిపోయిందంటే గాలి కన్నా వేగంగా ఇదే ప్రయాణిస్తోంది. కొందరి ఆలోచనలను, వ్యక్తిత్వాలను తీవ్రంగా…
పన్నెండు సంవత్సరాలు ఒక సినిమా విడుదల కాకుండా ల్యాబ్ లో మగ్గితే దాని మీద ఎవరికీ పెద్దగా ఆశలు ఉండవు.…
ఇటీవలే షూటింగ్ మొదలుపెట్టుకున్న అఖండ 2 తాండవం మీద ఏ స్థాయి అంచనాలున్నాయో చెప్పనక్కర్లేదు. బాలయ్యకు సాలిడ్ కంబ్యాక్ ఇచ్చిన…
ప్రపంచ ప్రఖ్యాత ఐటీ దిగ్గజ సంస్థ మైక్రోసాఫ్ట్ మాజీ సీఈవో.. బిల్ గేట్స్తో ఏపీ సీఎం చంద్రబాబు, ఆయన కుమారుడు,…
విశాఖపట్నంలోని శారదాపీఠం అధిపతి స్వరూపానందేంద్ర స్వామి.. వైసీపీ స్వామిగా ప్రచారంలో ఉన్న విషయం తెలిసిందే. వైసీపీ హయాంలో ఆయన చుట్టూ…
ఇప్పుడంతా డిజిటలే. అంతా నగదు రహితమే. పర్సులో కరెన్సీ నోట్లు ఉండాల్సిన అవసరమే లేదు. ఎంచక్కా… చేతిలో మొబైల్ ఫోన్…