తెలుగు సినిమాలను హిందీలో డబ్ చేసి రిలీజ్ చేస్తుంటే యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. ఇక్కడ పెద్దగా క్రేజ్ లేని హీరోల సినిమాలు కూడా యూట్యూబ్ లో రికార్డులు సృష్టిస్తున్నాయి. దీంతో హిందీ డబ్బింగ్ రైట్స్ కు డిమాండ్ పెరిగింది. బోయపాటి మాస్ సినిమాలను హిందీ ఆడియన్స్ బాగా ఇష్టపడుతున్నారు. అందుకే ఆయన ప్లాప్ సినిమా ‘వినయ విధేయ రామ’ కూడా భారీ రేటుకి అమ్ముడైంది. ఇప్పుడు ఆయన డైరెక్ట్ చేస్తోన్న ‘అఖండ’ సినిమా రైట్స్ ని పదిహేను కోట్లకు అమ్మేశారు.
ఇలాంటి ఓ డీల్ అల్లు అర్జున్ సినిమాకి కూడా వచ్చినట్లు తెలుస్తోంది. సుకుమార్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న ‘పుష్ప’ సినిమాకి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఫారెస్ట్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న భారీ యాక్షన్ సినిమా కావడంతో ప్రేక్షకులను సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. ఈ సినిమా టీజర్ యూట్యూబ్ ని షేక్ చేసింది. దీంతో సినిమా డబ్బింగ్ రైట్స్ కోసం కొన్ని కంపెనీలు ఎగబడ్డాయి.
అయితే ఫైనల్ గా రూ.17.5 కోట్లకు హిందీ డబ్బింగ్ రైట్స్ విక్రయించినట్లు తెలుస్తోంది. ఇది ఒక్క తొలి భాగానికి వచ్చిన రేటే. రెండో పార్ట్ ను సెపరేట్ గా అమ్మనున్నారు. ఇప్పటికే ఈ సినిమా పార్ట్ 1కి సంబంధించిన షూటింగ్ దాదాపుగా పూర్తయింది. రెండో భాగాన్ని వచ్చే ఏడాది నుండి చిత్రీకరించే అవకాశాలు ఉన్నాయి. రష్మిక హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా కనిపించనున్నారు.
This post was last modified on June 25, 2021 9:07 am
పండగ పేరునే సినిమా టైటిల్ పెట్టుకుని రావడం అరుదు. అందులోనూ స్టార్ హీరో అంటే ప్రత్యేకమైన అంచనాలు నెలకొంటాయి. ప్రకటన…
ఒకప్పుడు తెలుగు తమిళ సినిమాలను కొనే విషయంలో అలసత్వం ప్రదర్శించడం ఎంత పెద్ద తప్పో ఆర్ఆర్ఆర్ తర్వాత గుర్తించిన నెట్…
ఏదైనా పెద్ద సినిమా షూటింగ్ మధ్యలోనో లేదా పూర్తయ్యాకనో టీజర్ లేదా గ్లింప్స్ వదలడం సహజం. కానీ అసలు సెట్స్…
విక్రాంత్, చాందినీ చౌదరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న సినిమా "సంతాన ప్రాప్తిరస్తు". ఈ సినిమాను మధుర ఎంటర్ టైన్ మెంట్,…
ఇవాళ విడుదలైన సంక్రాంతికి వస్తున్నాం ఓపెనింగ్స్ కి ట్రేడ్ నివ్వెరపోతోంది. అడ్వాన్స్ బుకింగ్స్ తోనే రికార్డుల వేట మొదలుపెట్టడం చూసి…
థియేటరా ఓటిటినా అనేది పక్కనపెడితే భారతీయుడు 3 బయటికి రావడమైతే పక్కానే. కానీ గేమ్ చేంజర్ బ్లాక్ బస్టర్ అయితే…