శరత్ మరార్.. కొన్నేళ్ల కిందట టాలీవుడ్లో ఈ పేరు సూపర్ పాపులర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో ఒకప్పుడు ఈ నిర్మాత, వ్యాపారవేత్త ఎంత క్లోజ్‌గా ఉండేవాడో తెలిసిందే. పవన్ సినిమాలతో పాటు వ్యక్తిగత వ్యవహారాల్ని కూడా మరార్ చూసుకునేవాడు. ఆ సాన్నిహిత్యంతోనే వరుసగా పవన్ తో మూడు సినిమాలు ప్రొడ్యూస్ చేసే అరుదైన అవకాశం దక్కించుకున్నాడు.
గోపాల గోపాల, సర్దార్ గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాల నిర్మాత ఆయనే. పవన్ లాంటి హీరో వరుసగా ఓ నిర్మాతతో మూడు సినిమాలు చేయడం అన్నది నభూతో, నభవిష్యత్ కూడా. ఐతే పవన్‌తో ఆ స్నేహాన్ని ఎంతో కాలం నిలబెట్టుకోలేకపోయాడు శరత్. వీళ్లిద్దరికీ ఎక్కడో చెడింది. ఉన్నట్లుండి శరత్ సైడైపోయాడు. తర్వాత ఆయన రేంజ్ పడిపోయింది.
పవన్ తో అంత పెద్ద సినిమాలు తీసిన వాడు.. కర్తవ్యం, అదిరింది లాంటి డబ్బింగ్ సినిమాల రేంజికి పడిపోయాడు. ఈ మధ్య శరత్ నుంచి ఏ సినిమా అప్ డేట్లు లేవు. తాజాగా ఆయన వెబ్ సిరీస్ మీద దృష్టిపెట్టాడు. నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి రాబోతున్న కొత్త వెంచర్ పేరు.. భానుమతి రామకృష్ణ. టాలెంటెడ్ యాక్టర్ నవీన్ చంద్ర, కొత్తమ్మాయి సలోని లూథ్రా జంటగా నటించిన వెబ్ ఫిలిం ఇది.
దీని ట్రైలర్ తాజాగా లాంచ్ చేశారు. అది ఆసక్తికరంగా అనిపిస్తోంది. ఓ కార్పొరేట్ కంపెనీలో పని చేస్తూ 30 ఏళ్ల వయసు వచ్చినా తన టిపికల్ మెంటాలిటీ వల్ల ఇంకా పెళ్లి చేసుకోలేకపోయిన ఓ అమ్మాయి.. ఉద్యోగం కోసం సిటీకి ఎన్నో ఆశలతో వచ్చి ఈ అమ్మాయి కంపెనీలో చేరి ముందు తనను చికాకు పెట్టి ఆ తర్వాత తనకు దగ్గరయ్యే పల్లెటూరి కుర్రాడు.. వీళ్లిద్దరి మధ్య నడిచే కథ ఇది.
ట్రైలర్ చాలా సెన్సిబుల్‌గా, ఫన్నీగా.. కొన్ని చోట్ల హృద్యంగా అనిపించింది. వెబ్ సిరీస్‌లు ఇష్టపడే జనాలకు ఇది బాగానే ఎక్కేలా ఉంది. శ్రీకాత్ నాగోతి అనే కొత్త దర్శకుడు ఈ వెబ్ ఫిలింను డైరెక్ట్ చేశాడు. దీని రిలీజ్ వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.
This post was last modified on May 19, 2020 2:44 pm
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…