జబర్దస్త్ తరహా కామెడీ షోల్లో కమెడియన్లు హద్దులు దాటి మాట్లాడటం.. ఒకరి మీద ఒకరు పంచ్‌లేసుకోవడం.. కొన్ని సందర్భాల్లో జడ్జిలు, యాంకర్ల మీద పంచ్‌లు పడిపోవడం మామూలే. చూసేవాళ్లకు అతిగా అనిపించినా.. షోలో భాగమైన వాళ్లు మాత్రం అన్నింటినీ సరదాగానే తీసుకుంటుంటారు. అవి వివాదం కావడం అరుదు. ఐతే షో మధ్యలో కొన్నిసార్లు మాత్రం ఏదో జరిగిపోయినట్లు ప్రోమోలు కట్ చేసి వదులుతుంటారు. తీరా ఎపిసోడ్ చూస్తే ప్రోమోలో ఉన్నంత సీరియస్‌నెస్ షోలో లేదని అర్థమవుతుంది.
మరి జబర్దస్త్ షోకు సంబంధించిన కొత్త ప్రోమో ఈ టైపుదేనో ఏమో చెప్పలేం కానీ.. అందులో యాంకర్ అనసూయ ఓ మాటకు హర్ట్ అయి షో నుంచి సీరియస్‌గా వాకౌట్ చేసి వెళ్లిపోయినట్లు చూపించడం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రోమో ఇప్పుడు యూట్యూబ్‌లో వైరల్ అవుతోంది. ఈ నెల 24న ప్రసారం కాబోయే షోకు సంబంధించిన ప్రోమో ఇది. యూట్యూబ్‌లో ఇంటర్వ్యూలతో ఫేమస్ అయిన శివను హైపర్ ఆది తన స్కిట్ కోసం తీసుకొచ్చాడు. ఐతే షో చివర్లో శివ అనసూయను ఓ ప్రశ్న అడిగాడు.
ఇలాంటి పొట్టి పొట్టి డ్రెస్సులేంటి అంటూ సోషల్ మీడియాలో జనాలు కామెంట్లు పెడతారు కదా.. మీకేమనిపిస్తుంది అని అడిగాడు. దీనికి అనసూయ బదులిస్తూ.. బయటి వాళ్లకు ఇండస్ట్రీ గురించి తెలియదు కాబట్టి ఇలా అడగొచ్చు. కానీ మీరు ఇక్కడే ఉంటూ ఇలా అడిగారేంటి అని ఎదురు ప్రశ్నించింది. దీనికి కొనసాగింపుగా ఇది నా పర్సనల్ అని వ్యాఖ్యానించింది. ఐతే శివ దానికి ఊరుకోకుండా మీ పర్సనల్ అయితే మీ ఇంట్లో చూసుకోవచ్చు కదా అన్నాడు. దీనికి అనసూయ హర్టయింది. ఆది వైపు చూస్తూ ఎవరెవరినో తీసుకొచ్చి ఏంటీ ప్రశ్నలు అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయింది.
కెమెరా నుంచి ఔట్ ఫోకస్ అయ్యాక కూడా మీకు తెలియకుండానే ఇదంతా జరుగుతోందా అంటూ ఆగ్రహంగా బయటికి నడిచింది అనసూయ. ఆమెకు సర్దిచెప్పి లోపలికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు చూపిస్తూ ప్రోమోను ముగించారు. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ నెల 24న రాబోయే కొత్త ఎపిసోడ్ చూడాల్సిందే.
This post was last modified on June 21, 2021 10:36 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…