గత ఏడాది సంక్రాంతికి విడుదలైన భారీ విజయం సాధించిన తెలుగు చిత్రం ‘అల వైకుంఠపురములో’. అల్లు అర్జున్-త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కిన ఈ చిత్రం అంచనాల్ని మించిపోయి అనూహ్య విజయాన్నందుకుంది. దానికి వచ్చిన టాక్‌కు సూపర్ హిట్టో బ్లాక్‌బస్టరో కావాలి కానీ.. ఏకంగా నాన్-బాహుబలి హిట్ కావడమే ఆశ్చర్యం.
చాన్నాళ్ల తర్వాత త్రివిక్రమ్ నుంచి వచ్చిన ఈ ఫుల్ లెంగ్త్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కు సంక్రాంతి టైం బాగా కలిసొచ్చింది. ఈ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతుండటం విశేషం. ఐతే ఇక్కడ అల్లు అర్జున్ మాదిరి అక్కడ పెద్ద స్టార్ ఏమీ హీరోగా నటించట్లేదు. వర్ధమాన కథానాయకుడు కార్తీక్ ఆర్యన్.. అతడికి జోడీగా కృతి సనన్ నటిస్తున్నారు. రోహిత్ ధావన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఏక్తా కపూర్‌తో కలిసి ఒరిజినల్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ నిర్మిస్తుండటం విశేషం.
‘అల వైకుంఠపురములో’ హిందీ రీమేక్‌కు టైటిల్ కూడా ఖరారైపోయింది. ‘షెజాదా’ అనే పేరు పెట్టారు ఈ సినిమాకు. షెజాద్ అంటే హిందీలో యువరాజు అని అర్థం. కథ ప్రకారం చూస్తే ఈ సినిమాకు ఇది యాప్ట్ టైటిల్ అనడంలో సందేహం లేదు. ఇక ఒరిజినల్లో టబు చేసిన కీలక పాత్రను హిందీలో మనీషా కొయిరాలా చేయబోతోంది. విలక్షణ నటుడు పరేష్ రావల్ ఓ కీలక పాత్ర చేస్తున్నాడు. బహుశా ఆయన సచిన్ ఖేద్కర్ చేసిన టబు తండ్రి పాత్రలో కనిపించే అవకాశముంది.
జయరాం, సుశాంత్ పాత్రలకు ఎవరిని ఎంచుకున్నారో వెల్లడి కాలేదు. సీనియర్ దర్శకుడు డేవిడ్ ధావన్ తనయుడైన రోహిత్ ధావన్ డిషూమ్, దేశీ బాయ్జ్ లాంటి చిత్రాలకు దర్శకత్వం వహించాడు. ఎంటర్టైనర్లు బాగా తీస్తాడని పేరు తెచ్చుకున్న రోహిత్‌కు ఇంకా పెద్ద విజయం అయితే దక్కలేదు. ‘అల వైకుంఠపురములో’ రీమేక్ ఆ లోటును తీరుస్తుందేమో చూడాలి.
This post was last modified on June 21, 2021 12:15 pm
రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా గ్రూపులు అనగానే మహిళలే గుర్తుకు వస్తారు. ఎందుకంటే.. డ్వాక్రా అంటే.. స్వయం సహాయక మహిళా సంఘాలు!…
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…