సీనియర్ హీరోలకు హీరోయిన్లను సెట్ చేయడం ఒక పెద్ద టాస్క్ అయిపోయింది. చిరు, బాలయ్య, వెంకటేష్, నాగార్జున ఇలాంటి హీరోల సరసన నేటితరం హీరోయిన్లు రొమాన్స్ చేస్తుంటే ఎబ్బెట్టుగా ఉంటుంది. అందుకే వారి వయసుకి తగ్గట్లుగా ఉన్న తారలను తీసుకొస్తున్నారు. వీరందరిలో బాలకృష్ణకి హీరోయిన్ ను సెట్ చేయడం చాలా కష్టంగా మారింది. ‘అఖండ’ సినిమా సమయంలో కూడా ఇదే సమస్య ఏర్పడింది. చేసేదేం లేక ఫేడౌట్ అయిపోయిన ప్రగ్యాజైస్వాల్ ను తీసుకొచ్చారు. మరో ముఖ్య పాత్ర కోసం పూర్ణని తీసుకున్నారు.
ఇప్పుడు బాలయ్య నెక్స్ట్ సినిమా విషయంలో కూడా దర్శకుడు గోపీచంద్ మలినేనికి ఇదే ఇష్యూ ఎదురవుతోంది. శృతిహాసన్, త్రిష లాంటి హీరోయిన్లను సంప్రదిస్తే వారు ఆఫర్ ని రిజెక్ట్ చేశారు. దీంతో హీరోయిన్ వేటలో పడ్డారు దర్శకుడు గోపీచంద్. ఈ క్రమంలో నటి మెహ్రీన్ ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ మధ్యనే మెహ్రీన్ కి ఎంగేజ్మెంట్ అయింది. పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోదామని అనుకుంది. కానీ లాక్ డౌన్ కారణంగా పెళ్లి వాయిదా వేసుకుంది. పరిస్థితులు చక్కబడిన తరువాత పెళ్లి చేసుకుందామని నిర్ణయించుకున్నారు.
ఈ క్రమంలో తనకు వస్తోన్న సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో ‘ఎఫ్ 3’ సినిమా ఉండగా.. రీసెంట్ గా మారుతి-సంతోష్ శోభన్ సినిమా ఒప్పుకుంది. ఇప్పుడు బాలయ్య సినిమా ఆఫర్ రావడంతో అమ్మడు ఆలోచనలో పడినట్లు సమాచారం. బాలయ్య సినిమాలో నటిస్తే.. ఇక యంగ్ హీరోల సరసన అవకాశాలు రావేమోనని సందేహ పడుతుంది. ఆ కారణంగానే ఇంకా ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేకపోతుందట. మరేం జరుగుతుందో చూడాలి!
This post was last modified on June 20, 2021 12:24 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…