మెగాస్టార్ చిరంజీవి చేతిలో ఒకటికి మూడు ప్రాజెక్టులున్నాయి ఇప్పుడు. కొరటాల శివతో చేస్తున్న ‘ఆచార్య’ చివరి దశలో ఉండగా.. ‘లూసిఫర్’ను సెట్స్ మీదికి తీసుకెళ్లడానికి రంగం సిద్ధమైంది. అలాగే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘వేదాళం’ రీమేక్‌ను కూడా టైం చూసి పట్టాలెక్కించాల్సి ఉంది. ‘ఆచార్య’ కోసం చిరు కొన్ని రోజులే పని చేయాల్సి ఉంది. లాక్ డౌన్ షరతులు సడలించిన నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమాను మొదలుపెట్టాలని చూస్తున్నారు.
ఐతే చిరు ఈ విరామం తర్వాత ముందుగా చిత్రీకరణలో పాల్గొనబోయేది ‘లూసిఫర్’ రీమేక్‌లో అని అంటున్నారు. ముందు ఆ సినిమా కోసం ఒక షెడ్యూల్ చేసి.. ఆ తర్వాత ‘ఆచార్య’ మీదికి వస్తారట. చిరు తాజా లుక్ చూస్తే ఇది నిజమే అనిపిస్తోంది. మెగాస్టార్ ప్రస్తుతం ఇంతకుముందెన్నడూ చూడని సరికొత్త లుక్‌లో కనిపిస్తుండటం విశేషం.
కాంగ్రెస్ సీనియర్ నేత రఘువీరారెడ్డి తన ప్రాంతంలో రైతుల కోసం చేస్తున్న సేవ గురించి చెబుతూ, ఆయన్ని అభినందిస్తూ చిరంజీవి తాజాగా ఒక వీడియో రిలీజ్ చేశారు. అందులో రఘువీరాతో తనకున్న అనుబంధం గురించి వివరించారు. ఈ విషయాలను మించి ఇందులో నెటిజన్లన దృష్టిని ఆకర్షించింది చిరు లుక్. జుట్టును చక్కగా స్టైలింగ్ చేసుకున్న చిరు.. గడ్డం పెంచారు. ఐతే ఆ గడ్డం తెల్లబడి ఉండటం విశేషం. ఊరికే అలా పెంచి వదిలేసినట్లు కాకుండా లుక్ కోసం దాన్ని మెయింటైన్ చేస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది.
ఇది కచ్చితంగా ‘లూసిఫర్’ రీమేక్ కోసం సిద్ధమైన లుక్కే అని అందరూ చాలామంది అంటున్నారు. ‘లూసిఫర్’ ఒరిజినల్లో మోహన్ లాల్ దాదాపుగా ఇలాంటి లుక్‌తోనే కనిపిస్తారు. చిరు ఇలా సాల్ట్ అండ్ పెప్పర్ లుక్‌తో కనిపిస్తే అది కచ్చితంగా ప్రేక్షకులకు కొత్త అనుభూతినిస్తుందనడంలో సందేహం లేదు. ముఖ్యంగా అభిమానులకు ఈ లుక్ బాగా నచ్చేస్తుందనే అంచనా వేస్తున్నారు.
This post was last modified on June 19, 2021 4:00 pm
దేశంలో అత్యధిక సినీ అభిమానం ఉన్న ప్రేక్షకులుగా తెలుగు ఆడియన్సుకి పేరుంది. తెలుగు రాష్ట్రాలు రెంటినీ కలిపి ఒక యూనిట్…
జగిత్యాల జిల్లాలోని ప్రసిద్ధ కొండగట్టు ఆంజనేయ స్వామి ఆలయ అభివృద్ధికి తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) రూ.30 కోట్ల నిధులను…
అటు ఢిల్లీలో కేంద్ర మంత్రులను కలిసి ఏపీకి నిధులు మంజూరు అయ్యేలా ప్రయత్నాలు చేస్తుంటారు. ఇటు తన శాఖలను సమర్థవంతంగా…
నిన్న జరిగిన ఛాంపియన్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు రామ్ చరణ్ ముఖ్యఅతిధిగా రావడం హైప్ పరంగా దానికి మంచి…
వైసీపీ హయాంలో విశాఖపట్నంలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతం రుషికొండను తొలిచి.. నిర్మించిన భారీ భవనాల వ్యవహారం కొలిక్కి వస్తున్నట్టు ప్రభుత్వ…
భారీ అంచనాలతో గత వారం విడుదలైన అఖండ 2 తాండవం నెమ్మదిగా సాగుతోంది. రికార్డులు బద్దలవుతాయని అభిమానులు ఆశిస్తే ఇప్పుడు…