ఈ మధ్యకాలంలో చాలా మంది స్టార్లు డిజిటల్ ఇండస్ట్రీపై దృష్టి పెట్టారు. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్లు చాలా మంది వెబ్ సిరీస్ లు, వెబ్ ఫిలిమ్స్ ను ఒప్పుకుంటూ బిజీ అవుతున్నారు. కాజల్, తమన్నా, సమంత ఇలా చాలా మంది ఓటీటీల కోసం పని చేస్తున్నారు. నటి నిత్యామీనన్ కూడా గతేడాది డిజిటల్ ప్లాట్ ఫామ్ పై ఎంట్రీ ఇచ్చింది. బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ సరసన ‘బ్రీత్… ఇన్ టు ది షాడోస్’ అనే సిరీస్ ల నటించింది. అమెజాన్ ప్రసారమవుతోన్న ఈ షోకి ఓ మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.
ఇప్పుడు నిత్యామీనన్ మరో వెబ్ సిరీస్ లో నటించబోతుందని సమాచారం. కాస్త ఫేమ్ ఉన్న తారలను ఓటీటీ సంస్థలు తమ ఆఫర్లతో లాక్ చేస్తున్నాయి. ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ నిత్యామీనన్ ను కూడా తమ వెబ్ సిరీస్ కోసం లాక్ చేసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సిరీస్ కి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. ఒక్కసారి స్క్రిప్ట్ ఫైనల్ అయితే షూటింగ్ ను మొదలుపెట్టేస్తారు. ఓ కన్నడ దర్శకుడు ఈ సిరీస్ ను డైరెక్ట్ చేయనున్నారట.
తెలుగులో ఎన్నో సినిమాలు చేసిన నిత్యామీనన్ చివరిగా ‘నిన్నిలా నిన్నిలా’ సినిమాలో కనిపించింది. ప్రస్తుతం ఆమె మలయాళంలో రెండు సినిమాల్లో నటిస్తోంది. అలానే తెలుగులో ‘గమనం’ అనే సినిమాలో క్యామియో రోల్ లో నటించింది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవి కాకుండా ‘అయ్యప్పనుమ్ కోశియుమ్’ రీమేక్ లో పవన్ కళ్యాణ్ భార్య పాత్రలో కనిపించనుంది.
This post was last modified on June 19, 2021 2:09 pm
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…