ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 17 భాషల్లో.. అది కూడా 190 దేశాల్లో ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద గ్రాండ్ గా రిలీజ్ అయిన మూవీకి ఈ రోజు భారీ షాక్ తగిలింది. తన చిత్రాల ఎంపికలో వినూత్నంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకునే తమిళ స్టార్ హీరో ధనుష్ కు దిమ్మ తిరిగే షాక్ తగిలింది. ఈ రోజు (శుక్రవారం) ఆయన నటించిన ‘జగమే తందిరమ్’ ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద రిలీజ్ అయ్యింది.
తెలుగులో ఈ మూవీని ‘జగమే తంత్రం’ పేరుతో ఓటీటీ ఫ్లాట్ ఫాం అయిన నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ మూవీ ధనుష్ కెరీర్ లో నలభయ్యోది. ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్ గా నటించిన ఈ మూవీ మీద భారీ అంచనాలు ఉన్నాయి. కరోనా నేపథ్యంలో ఈ సినిమాను థియేటర్లలో విడుదల చేసే అవకాశం లేకపోవటంతో.. వీలైనన్ని భాషల్లో డబ్ చేసి ఏకకాలంలో విడుదల చేశారు.
రోటీన్ కు భిన్నంగా ఈ మూవీని మధ్యాహ్నం (భారత కాలమానం ప్రకారం) 12.30 గంటల వేళలో విడుదల చేశారు. అనూహ్యంగా ఈ మూవీ విడుదల చేసిన గంటల్లోనే ఆన్ లైన్ లో లీక్ కావటం షాకింగ్ గా మారింది. ఇదే విషయాన్ని తమిళ వెబ్ సైట్లు కోడై కూస్తున్నాయి. పైరసీ మూవీలు అప్ లోడ్ చేసే వెబ్ సైట్ లో ఫుల్ మూవీ లీకైనట్లుగా చెబుతున్నారు. భారీ అంచనాలతో ఓటీటీ ఫ్లాట్ ఫాం మీద విడుదలైన మూవీ కాస్తా లీక్ కావటం షాకింగ్ గా మారింది. హీరో ధనుష్ కు ఇదో ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు. అదే సమయంలో లీక్ పై చిత్ర యూనిట్ తీవ్ర ఆందోళనతో ఉంది. కష్టం ఇలా లీక్ రూపంలో ఆన్ లైన్ పాలు కావటం ఎవరికైనా ఇబ్బందే.
This post was last modified on June 18, 2021 11:17 pm
ప్రభాస్ తన లైనప్ లో ఎన్ని క్రేజీ కాంబినేషన్స్ సెట్ చేసినా కూడా హార్డ్ కోర్ ఫ్యాన్స్ ఫోకస్ మాత్రం…
ఏపీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం వైసీపీ లేని లోటును టీడీపీ ఎమ్మెల్యేలే తీర్చేస్తున్నారు. నిజానికి వైసీపీ ఉంటే కూడా ఇంతగా…
టాలీవుడ్లో అయినా.. మొత్తం ఇండియాలో అయినా… సోషల్ మీడియాలో అత్యధిక ట్రోలింగ్ ఎదుర్కొన్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు అంటే మరో…
మాములుగా ఎంత పెద్ద సినిమా అయినా సరే మూడో వారంలోకి వచ్చాక నెమ్మదించడం సహజం. కానీ అమరన్ మాత్రం ఈ…
తెలుగు సినిమా చరిత్రలోనే గొప్ప దర్శకుల్లో సుకుమార్ ఒకరు అనడంలో సందేహం లేదు. 20 ఏళ్ల కిందట్నుంచి సినిమాలు తీస్తున్న…
అత్తారింటికి దారేది సినిమాలో ఎంఎస్ నారాయణ చెప్పినట్టు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినవాడే విజేత. దీన్ని సరిగ్గా…