మెగాస్టార్ చిరంజీవి లైనప్‌లో చాలామందికి నచ్చని ప్రాజెక్టు అంటే.. మెహర్ రమేష్ దర్శకత్వంలో చేయబోయేదే. శక్తి, షాడో లాంటి డిజాస్టర్లు తీసిన దర్శకుడితో సినిమా ఏంటని అభిమానులు ఎంతగా సోషల్ మీడియాలో తమ అసంతృప్తిని వ్యక్తం చేసినప్పటికీ చిరు మాత్రం తన సమీప బంధువు, అలాగే తన సేవా కార్యక్రమాలను దగ్గరుండి చూసుకునే మెహర్ రమేష్ మీద అభిమానంతో అతడికి ఓ సినిమా ఇచ్చాడు.
మెహర్ సొంత కథతో కాకుండా తమిళంతలో హిట్టయిన ‘వేదాలం’ను రీమేక్ చేస్తుండటంతో మరీ కంగారు పడాల్సిన పని లేదనే అభిప్రాయాన్ని ఆయన సన్నిహితులు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రాజెక్టును చిరు ఖరారు చేసి ఏడాది దాటింది. కానీ ఇప్పటిదాకా ఆ చిత్రం మొదలు కాలేదు. ఆచార్య ఆలస్యం కావడం, ‘లూసిఫర్’ రీమేక్ లైన్లో ఉండటం ఇందుకు కారణం. ఈ చిత్రం ఇంకా లాంఛనంగా మొదలు కానప్పటికీ.. సినిమా కోసం కొంత షూటింగ్ అయితే జరిగిందని సమాచారం.
చిరుతో మెహర్ చేయనున్న సినిమా కోసం కోల్‌కతాలో కొన్ని మాంటేజెస్ షాట్లు తీశాడట మెహర్ రమేష్. గత ఏడాది దుర్గాష్టమి సందర్భంగా కోల్‌కతాలో ఘనంగా జరిగిన దేవీ నవరాత్రుల సమయంలో తన టీంతో వెళ్లి ఈ మాంటేజ్ షాట్లు తీసుకుని వచ్చాడట మెహర్. ఇందుకోసం దాదాపు రూ.30 లక్షల ఖర్చయినట్లు సమాచారం.
కేవలం మాంటేజ్ షాట్లకే ఇంతా అని ఆశ్చర్యం కలగొచ్చు కానీ.. మెహర్ ఏం చేసినా ఇలా భారీగానే ఉంటుంది. అప్పట్లోనే ‘శక్తి’ సినిమాకు రూ.50 కోట్ల దాకా ఖర్చు చేయించిన ఘనుడతను. అంత పెద్ద డిజాస్టర్ తర్వాత కూడా ‘షాడో’ కోసం రూ.30 కోట్ల బడ్జెట్ పెట్టించాడు. ఇప్పుడిక చిరంజీవి సినిమా అంటే ఖర్చు మామూలుగా ఉంటుందా? ‘ఆచార్య’తో పాటు ‘లూసిఫర్’ రీమేక్‌ను పూర్తి చేయడానికి చిరు ఇంకో ఆరేడు నెలలైనా సమయం తీసుకోవచ్చు. వచ్చే ఏడాదే మెహర్ రమేష్ సినిమాను ఆయన సెట్స్ మీదికి తీసుకెళ్లే అవకాశముంది.
This post was last modified on June 18, 2021 11:11 pm
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో బెస్ట్ మూవీస్ అంటే వెంటనే గుర్తొచ్చే పేర్లు భాష, నరసింహ, దళపతి. వీటిని…
బీఆర్ ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మాజీమంత్రి కేటీఆర్ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం ఒకరిద్దరి చేతుల్లో ఉంటే.. ఇలాంటి…
తొలి చిత్రం ‘మళ్ళీ రావా’తో దర్శకుడిగా బలమైన ముద్ర వేశాడు గౌతమ్ తిన్ననూరి. సుమంత్ లాంటి ఫాంలో లేని హీరోను పెట్టి,…
ఆరంభ సీజన్లతో పోలిస్తే ‘బిగ్ బాస్’ షోకు ఇప్పుడు ఆదరణ కొంచెం తగ్గిన మాట వాస్తవం. ఒకప్పట్లా సోషల్ మీడియాలో…
దసరాకే రావాల్సిన నందమూరి బాలకృష్ణ సినిమా ‘అఖండ-2’ వాయిదా పడి.. ‘రాజాసాబ్’ డేట్ను తీసుకుంది. ప్రభాస్ సినిమా సంక్రాంతికి వాయిదా పడడంతో డిసెంబరు 5కు…
వచ్చే ఏడాది సంక్రాంతి నుంచి ప్రజల మధ్యకు వస్తున్నానని.. తనతో పాటు 175 నియోజకవర్గాల్లో నాయకులు కూడా ప్రజలను కలుసుకోవాలని…