‘మాయ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన నటి నందిని రాయ్. ఆ తరువాత సుధీర్ బాబు నటించిన ‘మోసగాళ్లకు మోసగాడు’ సినిమాలో హీరోయిన్ గా కనిపించింది. కానీ ఈ సినిమాలేవీ నందినికి క్రేజ్ ను తీసుకురాలేకపోయాయి. ఆ తరువాత బిగ్ బాస్ సీజన్ 2 లో కంటెస్టెంట్ గా ఛాన్స్ దక్కించుకుంది. ఈ షోలో తన గ్లామర్ షోతో ప్రేక్షకులకు దగ్గరైంది. కానీ ఈ ఫేమ్ ను ఎక్కువ రోజులు కంటిన్యూ చేయలేకపోయింది. బిగ్ బాస్ తరువాత తెలుగులో ఒకట్రెండు సినిమాల్లో నటించినప్పటికీ ఏవీ వర్కవుట్ కాలేదు.
ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుంది. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ బ్యూటీ నటించిన ‘ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్’ అనే వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్ ప్రమోషన్స్ లో భాగంగా ఆమె కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ సిరీస్ లో ఓ సీన్ లో సహజత్వం కోసం తన కోస్టార్ వికాస్ నిజంగానే తన చెంప వాచిపోయేలా కొట్టాడని నందిని రాయ్ తెలిపింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో సీన్ చాలా నేచురల్ గా రావాలనేది డైరెక్టర్ ఆదేశమని చెప్పింది.
అయితే తన తోటి నటుడు వికాస్ ముందుగా తనను పైపైన కొట్టి ఊరుకున్నాడని.. దీంతో సీన్ సరిగ్గా రాలేదని చెప్పింది. వెంటనే ఇద్దరం ఒక అండర్ స్టాండింగ్ కి వచ్చి నిజంగానే కొట్టుకోవాలనే నిర్ణయం తీసుకున్నామని గుర్తుచేసుకుంది. షాట్ రెడీ అనేసరికి ఇద్దరం చెంపలు వాచిపోయేలా కొట్టుకున్నామని.. ఆ సమయంలో వచ్చిన కన్నీళ్లు నిజమైనవని నందిని చెప్పుకొచ్చింది. వికాస్ కొట్టిన దెబ్బకు చాలాసేపటి వరకు తన బుగ్గ వాచిపోయిందని.. ఆ వాపు తగ్గిన తరువాత నెక్స్ట్ సీన్ షూట్ చేశారని తెలిపింది.
ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ లో నందిని రాయ్ పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తుంది. నటన మీద ఇష్టంతో ఊరి నుండి పట్నంకు వచ్చిన అమ్మాయిగా ఆమె పాత్రను డిజైన్ చేశారు. ‘ఆహా’లో ప్రసారమవుతోన్న ఈ సిరీస్ ను ఏడు ఎపిసోడ్ లతో రూపొందించారు.
This post was last modified on June 18, 2021 10:53 pm
ఫిలిం సెలబ్రెటీలు పబ్లిక్‌లోకి రావాలంటే భయపడిపోయే పరిస్థితులు ఉన్నాయిప్పుడు. సోషల్ మీడియా ద్వారా సమాచారం తెలుసుకుని ఎక్కడికైనా సరే జనం…
భారత్- పాకిస్తాన్ సరిహద్దులను ఓ మైనర్ బాలిక దాటి రావడంతో నియంత్రణ రేఖ వద్ద కలకలం రేగింది. నిత్యం అప్రమత్తంగా…
అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో మీడియాకెక్కారు. ఒక ముఖ్యమంత్రిగా బాధ్యతతో వ్యవహారించాల్సిన ఆయన అత్యంత…
కొన్నేళ్లుగా టాలీవుడ్లో రీ రిలీజ్ మేనియా ఎలా నడుస్తోందో తెలిసిందే. ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో లేదా యూట్యూబ్‌లో ఎప్పుడైనా చూసుకునే…
బాలీవుడ్ చరిత్రలో గొప్ప బ్లాక్ బస్టర్స్ లో ఒకటిగా నిలిచిన దురంధర్ మొదటి భాగంలో హీరో కన్నా ఎక్కువ పేరు…
ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గం ఒక్కసారిగా రాజకీయ చర్చకు వేదికగా మారింది. ప్రస్తుతం ఈ నియోజకవర్గం నుంచి మంత్రి…