నేచురల్ స్టార్ నాని నిర్మిచిన ‘అ!’ సినిమాతో దర్శకుడిగా పరిచయమయ్యారు ప్రశాంత్ వర్మ. తొలి సినిమాలతోనే విమర్శకుల ప్రసంశలు అందుకున్నారు. ఆ తరువాత ‘కల్కి’, ‘జాంబీ రెడ్డి’ లాంటి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. తేజ సజ్జ హీరోగా నటించిన ‘జాంబీ రెడ్డి’ సినిమా ఓ వర్గం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకుంది. ఇందులో కామెడీ కూడా బాగా వర్కవుట్ అయింది. ఒక్కో సినిమాని ఒక్కో జోనర్ లో తీసే ప్రశాంత్ వర్మ తన తదుపరి సినిమా కోసం మరో డిఫరెంట్ జోనర్ ని ఎన్నుకున్నాడు.
సూపర్ హీరో కాన్సెప్ట్ తో ‘హనుమాన్’ అనే సినిమాను తెరకెక్కించనున్నారు. కొన్నిరోజుల క్రితం ఈ సినిమా టైటిల్ టీజర్ ను రిలీజ్ చేశారు. పురాణాల్లో సూపర్ మ్యాన్ అంటే హనుమాన్ అనే చెప్పాలి. అందుకే అదే క్యారెక్టర్ తో తెలుగులో సూపర్ హీరో సినిమా తీస్తానని అంటున్నారు ప్రశాంత్ వర్మ. అయితే హనుమాన్ గా ఎవరు నటించబోతున్నారనే విషయం మాత్రం చెప్పలేదు. మొన్నటివరకు మెగాహీరో సాయి ధరమ్ తేజ్ ఇందులో నటించే ఛాన్స్ ఉందని అన్నారు.
తాజా సమాచారం ప్రకారం.. ఇందులో యంగ్ హీరో తేజ సజ్జను తీసుకున్నారట. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలు చేసిన తేజ ‘ఓ బేబీ’ సినిమాలో కీలకపాత్ర పోషించారు. ఆ తరువాత ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ‘జాంబీ రెడ్డి’ సినిమాతో హీరోగా మారారు. ఈ సినిమా అతడికి మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇప్పుడు మరోసారి తేజనే తన సినిమాలో తీసుకోవాలని భావిస్తున్నారట ప్రశాంత్ వర్మ. సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందించనున్న ఈ సినిమాను పలు భాషల్లో విడుదల చేయాలనుకుంటున్నారు.
This post was last modified on June 16, 2021 3:16 pm
ఎనభై తొంబై దశకంలో సినిమాలు చూసినవాళ్లకు బాగా పరిచయమున్న పేరు నందమూరి కళ్యాణ చక్రవర్తి. స్వర్గీయ ఎన్టీఆర్ సోదరుడు త్రివిక్రమరావు…
శుక్రవారం ఏదైనా థియేటర్ రిలీజ్ మిస్ అయితే మూవీ లవర్స్ బాధ పడకుండా ఓటిటిలు ఆ లోటు తీరుస్తున్నాయి. ఇంకా…
తెలంగాణకు చెందిన ప్రముఖ రాజకీయ నాయకుడు, సీపీఐ మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర సినిమాగా రాబోతున్న సంగతి…
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…