Movie News

రాజమౌళి పిలవడమే ఆలస్యం..


‘ఆర్ఆర్ఆర్’లో రామ్ చరణ్‌కు జోడీగా ఏరి కోరి ఆలియా భట్‌ను ఎంచుకున్నాడు రాజమౌళి. ‘బాహుబలి’ తర్వాత ఆయన రేంజ్ ఎంతలా పెరిగిందో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఆయన స్థాయికి ఇండియలో ఏ స్టార్ హీరోయిన్‌ను పిలిచినా పరుగెత్తుకొచ్చి సినిమా చేసేస్తుంది. ఐతే ఆలియా మాత్రం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాను కన్ఫమ్ చేయడానికి కొంచెం టైం తీసుకుంది. అలాగే షూటింగ్‌కు హాజరయ్యే విషయంలోనూ చిత్ర బృందాన్ని కొంత ఇబ్బంది పెట్టినట్లు అప్పట్లో వార్తలొచ్చాయి.

కానీ ఒకసారి ‘ఆర్ఆర్ఆర్’ సెట్లోకి అడుగు పెట్టాక ఆమె వైఖరి పూర్తిగా మారిపోయింది. ఈ సినిమా, ఇందులోని తన పాత్ర కెరీర్లో మైలురాయిలా నిలిచిపోతుందని ఆమెకు అర్థమైనట్లే ఉంది. ఆలియా ఫస్ట్ లుక్ చూసి.. అలాగే తన పాత్ర గురించి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఇచ్చిన ఎలివేషన్ విన్నాక ఈ పాత్రపై అందరిలోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఈ పాత్రను ఆలియా కూడా ఎంతో ఇష్టపడి చేస్తున్నట్లే ఉంది.

‘ఆర్ఆర్ఆర్’ ఇప్పుడు ఆలియాకు టాప్ ప్రయారిటీగా మారినట్లే కనిపిస్తోంది. చేతిలో గంగూబాయి కథియావాడి, బ్రహ్మాస్త్ర లాంటి భారీ చిత్రాలు ఉన్నప్పటికీ.. కరోనా సెకండ్ వేవ్ తర్వాత ముందుగా ‘ఆర్ఆర్ఆర్’లో తన పని పూర్తి చేయడానికే ఆలియా చూస్తోందట. బాలీవుడ్ కమిట్మెంట్లన్నింటనీ ఆమె పక్కన పెట్టినట్లు సమాచారం. ముందుగా ‘ఆర్ఆర్ఆర్’లో తన పాత్రకు సంబంధించి షూటింగ్ పూర్తి చేయడానికే ఆమె రెడీగా ఉందట.

రాజమౌళి ఎప్పుడు పిలిస్తే అప్పుడు షూటింగ్‌కు వచ్చేసి, మొత్తం తన పని పూర్తయ్యే వరకు ఈ టీంతోనే ఉండాలని డిసైడైనట్లు సమాచారం. ‘ఆర్ఆర్ఆర్’ చిత్రీకరణను జులై 1న పున:ప్రారంభిస్తారని అంటున్నారు. కొన్ని రోజుల్లోనే ఆలియా చిత్ర బృందంతో కలిసే అవకాశముంది. అటు ఇటుగా ఇంకో నెల రోజుల చిత్రీకరణ మిగిలి ఉన్నట్లు చెబుతున్నారు. అక్టోబరు 13న ఈ చిత్రం రావడం దాదాపు అసాధ్యం. వచ్చే వేసవికి వాయిదా వేయాలని యోచిస్తున్నట్లు సమాచారం.

This post was last modified on June 16, 2021 10:41 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

ఎవరి సత్తా ఎంత?… రైజింగ్ తెలంగాణ వర్సెస్ బ్రాండ్ ఏపీ!

వరల్డ్ ఎకనమిక్ ఫోరం 55వ వార్షిక సదస్సులు సోమవారం దావోప్ లో ప్రారంభం కానున్నాయి. దాదాపుగా విశ్వవ్యాప్తంగా ఉన్న అన్ని…

2 hours ago

చిరు తర్వాత వెంకీనే..

టాలీవుడ్ సీనియర్ హీరోల్లో అనేక రికార్డు మెగాస్టార్ చిరంజీవి పేరు మీదే ఉన్నాయి. ఒకప్పుడు ఆయన చూసిన వైభవమే వేరు.…

5 hours ago

ఢిల్లీ పెద్ద‌ల‌ను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న రేవంత్

తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ అధిష్టానానికి చెడిందా? ప్ర‌త్యేక రాష్ట్రం ఏర్పాటు మైలేజీ పొంద‌లేక‌, ప‌దేళ్ల పాటు అధికారానికి…

5 hours ago

పవిత్ర వచ్చాక నరేష్ ‘టైటానిక్’ ఒడ్డుకు..

సీనియర్ నటుడు నరేష్ వ్యక్తిగత జీవితం గురించి కొన్నేళ్ల ముందు ఎంత గొడవ జరిగిందో తెలిసిందే. తెలుగు సినిమాల్లో బిజీ…

6 hours ago

ఆ సినిమా తనది కాదన్న గౌతమ్ మీనన్

గౌతమ్ మీనన్.. గత పాతికేళ్లలో సౌత్ ఇండియా నుంచి వచ్చిన గ్రేట్ డైరెక్టర్లలో ఒకడు. కాక్క కాక్క, ఏమాయ చేసావె,…

7 hours ago

చంద్ర‌బాబు ‘అలా’ చెప్పారు.. అధికారులు ‘ఇలా’ చేశారు!!

ప్ర‌భుత్వం త‌ర‌ఫున ప‌నులు పూర్తి కావాలంటే రోజులు వారాలే కాదు.. నెల‌లు సంవ‌త్స‌రాల స‌మ‌యం కూడా ప‌డుతుంది. అనేక మంది…

8 hours ago