ఇంకో రెండు రోజుల్లోనే నెట్ ఫ్లిక్స్ ద్వారా నేరుగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది తమిళ స్టార్ ధనుష్ ప్రధాన పాత్రలో నటించిన ‘జగమే తంత్రం’ సినిమా. థియేటర్లలో అయితే ఈ చిత్రం తమిళం, తెలుగు భాషల్లోనే విడుదలయ్యేది. కానీ డిజిటల్ రిలీజ్ కావడంతో అనేక భాషల్లో ఆడియోను జోడిస్తున్నారు. ఏకంగా 17 భాషల్లో ‘జగమే తంత్రం’ విడుదలవుతుండటం విశేషం. ఏకంగా 190 దేశాల్లో ఈ చిత్రం స్ట్రీమ్ కానుంది. మరి ఇంత భారీగా రిలీజ్ చేస్తున్న ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ వాళ్లు ఎంత చెల్లించారో తెలుసా? అక్షరాలా 60 కోట్ల రూపాయలు.
ఓ రీజనల్ లాంగ్వేజ్ చిత్రానికి ఈ రేటు ఎక్కువే అనిపించొచ్చు. కానీ ఈ సినిమాపై ఉన్న అంచనాల దృష్ట్యా అది మరీ ఎక్కువ రేటేమీ కాదు. థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ధనుష్ సినిమాకు 60-70 కోట్ల మేర గ్రాస్ ఈజీగా వస్తుంది. ఆ తర్వాత ఓటీటీలో రిలీజ్ చేస్తే వచ్చే ఆదాయం అదనం. ఆ లెక్కన చూస్తే ‘జగమే తంత్రం’ రీజనబుల్ రేటుకే నెట్ ఫ్లిక్స్ సొంతమైనట్లు.
తమిళంలోనే కాదు.. దక్షిణాదిన డైరెక్ట్ ఓటీటీలో రిలీజైన చిత్రాల్లో అత్యధిక రేటు పలికిన చిత్రం ‘జగమే తంత్రం’యే కావడం విశేషం. ఇప్పటిదాకా రికార్డు సూర్య సినిమా ‘సూరారై పొట్రు’ (ఆకాశం నీ హద్దురా) పేరిట ఉంది. ఆ చిత్రానికి అమేజాన్ ప్రైమ్ వాళ్లు రూ.55 కోట్లు చెల్లించారట. దాన్ని ‘జగమే తంత్రం’ అధిగమించింది. దీని నిర్మాత శశికాంత్ మంచి లాభానికే సినిమాను అమ్ముకున్నట్లు తెలుస్తోంది.
ధనుష్ ‘జగమే తంత్రం’ థియేటర్లలోనే రిలీజ్ చేయాలని పట్టుబట్టినప్పటికీ.. కరోనా ఫస్ట్ వేవ్ అనంతర పరిస్థితుల దృష్ట్యా శశికాంత్ మాత్రం ఓటీటీ రిలీజ్‌కు వెళ్లిపోయారు. దీనిపై ధనుష్ మొదట్లో అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ.. తర్వాత సర్దుకున్నాడు. భారీ రేటు పెట్టి కొన్న రీజనల్ సినిమాను బాగా మార్కెట్ చేసుకుని అందుకు తగ్గ ప్రయోజనం పొందడం కోసం నెట్ ఫ్లిక్స్ భారీ రిలీజే ప్లాన్ చేసింది. ‘పిజ్జా’, ‘జిగర్ తండ’, ‘పేట’ చిత్రాల దర్వకుడు కార్తీక్ సుబ్బరాజ్ ‘జగమే తంత్రం’ను రూపొందించాడు.
This post was last modified on June 16, 2021 8:21 am
ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో నాలుగు రోజుల పర్యటన నిమిత్తం వెళ్లిన.. ఆయ న సతీమణి నారా…
అర్ధమయ్యి కానట్టు, అసలు అర్థమే లేనట్టు, అర్థం చేసుకుంటే ఏదో ఉన్నట్టు అనిపించే ఒక వెరైటీ సినిమా తీసిన ఉపేంద్ర…
అల్లు అర్జున్-పుష్ప-2 వివాదంపై తాజాగా తెలంగాణ డీజీపీ జితేందర్ స్పందించారు. ఆయన సినిమా హీరో అంతే! అని అర్జున్ వ్యవహారంపై…
ప్రతిష్ఠాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య డిసెంబర్ 26న ప్రారంభమయ్యే నాలుగో టెస్ట్ మ్యాచ్కు ముందు…
పుష్ప-2 సినిమా బెనిఫిట్ షో ప్రదర్శన సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోయిన ఘటనకు…
అండర్-19 ఆసియా కప్ టోర్నీలో భారత మహిళల జట్టు చరిత్ర సృష్టించింది. తొలిసారి టీ20 ఫార్మాట్లో జరిగిన ఈ టోర్నీ…